Chopper Crash : ఎలాంటి సమాచారం లేకుండా..ఊహాగానాలు వద్దు – వైమానిక దళం ప్రకటన

హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే ఇది పూర్తవుతుందని వెల్లడించింది. రావత్ దంపతుల అంతిమయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది.

Chopper Crash Air Force : తమిళనాడు రాష్ట్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై భారత వైమానిక దళం స్పందించింది. ఘటన జరిగిన తీరుపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయ్యింది. ఎలాంటి స్పష్టమైన సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలని సూచించింది. హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే ఇది పూర్తవుతుందని వెల్లడించింది. తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నాం జరిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్​ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులతో సహా మొత్తం 13 మంది మరణించిన విషయం తెలిసిందే.

Read More : Airports : 2025 వరకు 25 ఎయిర్‌పోర్ట్‌లను ప్రయివేటీకరిస్తాం – కేంద్రం

ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురైంది. ప్రతి ఒక్కరిని కలిచివేసింది. కానీ..సోషల్ మీడియాలో ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో వైమానిక దళం స్పందించాల్సి వచ్చింది. డిసెంబర్ 08వ తేదీ 2021 నాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు, దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మర్యాదను కాపాడాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ఎలాంటి సమాచారం లేకుండా..ఊహాగానాలకు దూరంగా ఉండాలని మరోసారి సూచించింది. ఘటనపై ట్రై సిర్వీస్ కోర్టు ఆఫ్ ఎంక్వైరి వేసిన సంగతి తెలిసిందే.

Read More : Human rights day : వేధింపుల భరించలేక మ‌హిళ‌లు ఉద్యోగాలు మానేస్తున్నారు : మానవ హక్కుల కమిషన్‌ అధ్యయనం

మరోవైపు….రావత్ దంపతుల అంతిమయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది. భూటాన్, నేపాల్, శ్రీలంక దేశాలకు చెందిన సైనిక ప్రతినిధులు, ఇతర ప్రముఖులు నివాళులర్పించారు. సాయంత్రం 4 గంటలకు రావత్ దంపతుల అంత్యక్రియలు జరుగనున్నాయి. పూర్తి సైనిక లాంఛనాలతో బిపిన్ రావత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 17 గన్ సెల్యూట్ ఆర్మీ ఇవ్వనుంది. ఫ్రంట్ ఎస్కార్ట్ గా 120 మంది త్రివిధ దళ సభ్యులు ఉండనున్నారు. అంత్యక్రియల్లో 800 మంది సర్వీస్ మెన్ పాల్గొననున్నారు. సీడీఎస్ రావత్ కు ఆర్మీ సగౌరవ వీడ్కోలు పలుకనుంది.

ట్రెండింగ్ వార్తలు