Pawan Khera: ఢిల్లీ ఎయిర్‭పోర్టులో హైడ్రామా.. కాంగ్రెస్ నేత పవన్ ఖేడాను విమానం నుంచి దింపి మరీ అరెస్ట్ చేసిన అస్సాం పోలీసులు

ఖేడా విమానం దిగే సమయంలో అనుమానంతో ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం విమానం దిగారు. ఖేడా అరెస్ట్ కాగానే విమానాశ్రయంలోనే నిరసన చేపట్టారు. విమానం అక్కడి నుంచి బయల్దేరకుండా అడ్డుకున్నారు. ఇక ఖేడా అరెస్ట్ మీద కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించింది. ఈ విషయమై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేడాను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా ఆయనను విమానం నుంచి దింపి. ఇంకో విషయం ఏంటంటే, ఆయన అరెస్టైంది ఢిల్లీ ఎయిర్‭పోర్టులో. ఛత్తీస్‭గాఢ్ రాజధాని రాయ్‭పూర్‭లో జరిగే కాంగ్రెస్ ప్లీనరీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఖేడా బయల్దేరారు. ఢిల్లీ ఎయిర్‭పోర్టులో ఇండిగో విమానం ఎక్కిన ఆయనను ఏదో కారణం చెప్పి కిందకు దింపారు. అనంతరం ఆయనను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని అవమానించే విధంగా ఖేడా వ్యాఖ్యానించినట్లు అస్సాంలో ఫిర్యాదు నమోదు అయిందని, అందుకే అరెస్ట్ చేసినట్లు అస్సాం పోలీసులు తెలిపారు.

Caught On Camera: సుకేష్ జైలు గదిలో లగ్జరీ ఐటమ్స్.. జైల్లో కన్నీళ్లు పెట్టుకున్న సుకేష్.. వీడియో రిలీజ్

అయితే ఖేడా విమానం దిగే సమయంలో అనుమానంతో ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం విమానం దిగారు. ఖేడా అరెస్ట్ కాగానే విమానాశ్రయంలోనే నిరసన చేపట్టారు. విమానం అక్కడి నుంచి బయల్దేరకుండా అడ్డుకున్నారు. ఇక ఖేడా అరెస్ట్ మీద కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించింది. ఈ విషయమై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

Seattle Bans caste discrimination : కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం చేసిన అమెరికాలోని తొలి నగరం

ఇక దీనిపై పవన్ ఖేడా స్పందిస్తూ ‘‘మొదట నా లగేజీ ఎక్కువుందని, నాకు విమానంలోకి అనుమతి లేదని అన్నారు. కానీ నేను ఒకే ఒక్క బ్యాగేజీ తెచ్చుకున్నాను. అయినప్పటికీ నన్ను విమానంలోకి అనుమతించలేమని చెప్పారు. ఇంతలో డీసీపీ (డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్) వచ్చి కలుస్తారని, అతడు చాలా సమయం నుంచి ఎదురు చూస్తున్నట్లు చెప్పారు’’ అని విమానం దిగిన అనంతరం ఖేడా అన్నారు. ఖేడాను ప్రస్తుతం గుహవాటికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి వేణుగోపాల్ స్పందిస్తూ ‘‘మోదీ ప్రభుత్వం గూండా తరహాలో వ్యవహరిస్తోంది. ఏఐసీసీ ప్లీనరీకి వెళ్లకుండా పవన్ ఖేడాను అడ్డుకున్నారు. ఆయన గొంతును అణగదొక్కేందుకు ఎంతకైనా దిగజారుతున్నారు. ఇంతకంటే సిగ్గు చేటు ఉండదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు