Dasara Movie: నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో నాని ఊరమాస్ అవతారంలో చేసిన పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది.
Dasara Movie: దసరా మూవీకి అక్కడ కనీస ఆదరణ లేదంటోన్న క్రిటిక్స్.. నిజమేనా?
ఈ సినిమాకు తొలిరోజు నుండే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు మంచి వసూళ్లను అందిస్తూ వచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా హౌజ్‌ఫుల్ బోర్డులతో థియేటర్లలో సందడి చేసింది. ఫలితంగా ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి నాని కెరీర్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక నానికి మంచి ఫాలోయింగ్ ఉన్న ఓవర్సీస్ మార్కెట్‌ను కూడా దసరా అల్లాడిస్తోంది. ఇప్పటికే 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి అలవోకగా చేరిపోయిన దసరా, ఇప్పుడు 2 మిలియన్ డాలర్ క్లబ్‌పై కన్నేసింది.
Dasara Blockbuster Daawath : దసరా ధూమ్ ధామ్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్ గ్యాలరీ..
తాజా లెక్కల ప్రకారం దసరా మూవీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద $1.95 మిలియన్‌కు పైగా వసూళ్లు సాధించినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి దసరా సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఈ వీకెండ్లో ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.
The Dharani’s Mass Madness is on a whole new level 🔥🔥
Natural Star @NameIsNani‘s #Dasara hits $1.95M+ at the USA box office and is marching towards a gigantic $2M mark ! 💥💥#DasarainUSA pic.twitter.com/bPEGsRKtB7
— Dasara Movie (@Dasara_Movie) April 9, 2023