General Coaches: జెనరల్ సీట్లకు రిజర్వేషన్ అక్కర్లేదు.. బుకింగ్‌ కౌంటర్లలో టికెట్స్ కొనుక్కోవచ్చు

ప్రయాణీకుల డిమాండ్ దృష్ట్యా, భారతీయ రైల్వేలు వివిధ జోన్లలో నిరంతరం పెరుగుతున్న రైళ్ల సంఖ్యతో రైళ్ల నిర్వహణ వ్యవధిని విస్తరిస్తోంది.

General Coaches: ప్రయాణీకుల డిమాండ్ దృష్ట్యా, భారతీయ రైల్వేలు వివిధ జోన్లలో నిరంతరం పెరుగుతున్న రైళ్ల సంఖ్యతో రైళ్ల నిర్వహణ వ్యవధిని విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కరోనా కారణంగా విధించిన నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా రిజర్వేషన్‌ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణం చేసేందుకు వీళ్లేకుండా రైల్వేశాఖ అప్పట్లో నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ఆ నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసిన రైల్వేశాఖ.. రిజర్వేషన్‌ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అందులో ప్రకటించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు రిజర్వేషన్‌ ఉంటేనే రైలులో ప్రయాణించేందుకు అనుమతి, రైల్వే స్టేషన్‌లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది. అయితే, కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

జనరల్‌ బోగీ ప్రయాణానికి రిజర్వేషన్‌ అవసరం గతంలో కూడా లేదు.. ఇప్పుడు కూడా అదే పద్దతి సాగనుంది. రైల్వే స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్‌ కౌంటర్లలో అన్‌రిజర్వుడ్‌ టికెట్‌ కొనుగోలు చేసుకుని ఇకపై ప్రయాణం చేసుకోవడానికి అవకాశం కల్పించవచ్చు. దక్షిణమధ్య రైల్వే జోన్‌ పరిధిలోని 74 రైళ్లలో జనరల్‌ బోగీలను రిజర్వేషన్‌ నుంచి మినహాయిస్తున్నట్లుగా స్టేషన్లకు కూడా సమాచారం ఇచ్చారు అధికారులు. ఇందులో సికింద్రాబాద్‌ డివిజన్‌లో 29, విజయవాడ డివిజన్‌లో 12, నాందేడ్‌లో 12, గుంతకల్లులో 10, హైదరాబాద్‌లో ఆరు, గుంటూరులో ఐదు రైళ్లు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు