జాత్యహంకార వ్యాఖ్యల వివాదం.. కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా, ఆమోదించిన ఖర్గే

శామ్ పిట్రోడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో తన బంధాన్ని తెంచుకున్నారు.

Sam Pitroda Quits Congress: జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో తన బంధాన్ని తెంచుకున్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపారు. లోక్‌స‌భ‌ ఎన్నికల నేపథ్యంలో శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

శామ్ పిట్రోడా రాజీనామా విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు తానుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పిట్రోడా నిర్ణయాన్ని తమ పార్టీ అధ్యక్షుడు ఆమోదించారని పేర్కొన్నారు.

కాగా, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో వివాదం చెలరేగింది. పిట్రోడా వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ అగ్ర నాయకులు తప్పుబట్టారు. పిట్రోడా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించింది.

Also Read: లోక్‌స‌భ‌ ఎన్నికల వేళ హర్యానాలో బీజేపీ ప్రభుత్వానికి షాక్!

శామ్ పిట్రోడా ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు సలహాదారుగా వ్యవహరించారు. 2004 ఎన్నికలలో UPA విజయం సాధించిన తర్వాత శామ్ పిట్రోడాను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ భారత జాతీయ నాలెడ్జ్ కమిషన్‌కు అధ్యక్షుడిగా నియమించారు. 2009లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై మన్మోహన్ సింగ్‌కి సలహాదారుగా పనిచేశారు.

 

ట్రెండింగ్ వార్తలు