Delhi Covid Cases : ఢిల్లీలో కరోనా విజృంభణ.. నిఘా పెంచాం.. ఆందోళన చెందొద్దు : మనీష్ సిసోడియా

Delhi Covid Cases : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా తీవ్రత తగ్గినట్టే తగ్గి మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వాసుల్లో ఆందోళన నెలకొంది.

Delhi Covid Cases : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా తీవ్రత తగ్గినట్టే తగ్గి మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వాసుల్లో ఆందోళన నెలకొంది. కరోనా కేసులకు సంబంధించి కేజ్రీవాల్ అప్రమత్తమైంది. కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వం నిఘా పెంచిందని, ఢిల్లీ వాసులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సూచించారు. ప్రస్తుతం కరోనా కేసుల తీవ్రతపై ప్రభుత్వం నిఘాను పెంచిందని ఆయన చెప్పారు. LNJP ఆసుపత్రిలో కేవలం 6గురు మాత్రమే బాధితులు ఉన్నారని అన్నారు.

పాఠశాలల్లో కేసులు నమోదైతే వెంటనే SOPని అనుసరించాలని సూచనలను చేసినట్టు తెలిపారు. ప్రత్యేక తరగతి గది కేటాయించడం లేదా కరోనా సోకిన విభాగాన్ని మాత్రమే మూసివేయనున్నట్టు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పారు. అయితే మొత్తానికే పాఠశాలను మూసివేయాలని ఆదేశించలేదన్నారు. ఎవరైనా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే.. కేవలం ఆ తరగతి గదిని మాత్రమే తాత్కాలికంగా మూసివేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్న విషయాన్ని సిసోడియా ప్రస్తావించారు. చిన్నారుల్లో ఎవరికైనా కరోనా సోకినప్పుడు లేదా పాఠశాలలోని కరోనా ప్రభావం ఉన్న ప్రాంతంలో వెళ్లిన సందర్భాలలో మాత్రమే స్కూల్ మొత్తం ప్రాంగణాన్ని మూసివేయడానికి నిర్ణయం తీసుకోవచ్చునని సూచించారు. కరోనా కేసులు గుర్తించిన నిర్దిష్ట విభాగం లేదా తరగతి గదులను మాత్రమే తాత్కాలికంగా మూసివేయాలని సూచనలు చేశారు. నగరంలో పెరుగుతున్న కరోనా కేసుల మధ్య యూపీ ప్రభుత్వం ఢిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతాలను కూడా హై అలర్ట్ చేసింది.

ఢిల్లీలోని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాస్క్‌లు, శానిటైజేషన్ చేసుకోవడంతో పాటు చేతులు తప్పనిసరిగా కడుక్కోవాలనే ప్రామాణిక ప్రోటోకాల్‌ను అమలు చేస్తున్నట్టు సొసోడియా తెలిపారు. ఢిల్లీలో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ వాసులు ఎవరూ పెద్దగా భయపడాల్సిన పరిస్థితి లేదని వైద్యులు కూడా చెబుతున్నారు. ఏప్రిల్ 12న పాజిటివిటీ రేటు 0.5శాతం నుంచి 2శాతానికి పెరిగింది. గత రెండు నెలల్లో ఇదే అత్యధికమన్నారు. ఢిల్లీలో శనివారం మరో 14 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఆరోగ్య శాఖ అధికారిక డేటా ప్రకారం.. ఢిల్లీలో శుక్రవారం 300కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి, కొత్త కరోనా కేసులతో 366 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 209 రికవరీలు, సున్నా మరణాలు నమోదయ్యాయి. దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు కూడా శుక్రవారం 2శాతం నుంచి 4శతానికి పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య శనివారం నాటికి 4,30,40,947కు చేరుకుంది. మరో 975 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఢిల్లీలో యాక్టివ్ కేసులు 11,366 కు పెరిగాయి. మరో కొత్త 4 మరణాలతో ఢిల్లీలో మొత్తం మరణాల సంఖ్య 5,21,747కి చేరుకుంది.

Read Also :  Delhi Covid Cases : ఢిల్లీలో కొత్తగా 920 కొవిడ్ కేసులు.. 1.68శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు

ట్రెండింగ్ వార్తలు