Adipurush : మన ఇతిహాసాలని జపాన్ వాళ్ళు తీస్తున్నారు.. మనం?.. డైరెక్టర్ ఓంరౌత్ వ్యాఖ్యలు..

తాజాగా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓంరౌత్ ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఆదిపురుష్' సినిమా ఆలోచన ఎలా వచ్చింది అంటూ సినిమా మొదలయ్యే వెనక ఉన్న కథ గురించి ఆసక్తికర విషయాలని........

Adipurush :   పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రామాయణాన్ని ఆధారంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు.

తాజాగా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓంరౌత్ ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆదిపురుష్’ సినిమా ఆలోచన ఎలా వచ్చింది అంటూ సినిమా మొదలయ్యే వెనక ఉన్న కథ గురించి ఆసక్తికర విషయాలని తెలియచేశారు. ఆదిపురుష్ సినిమా వెనుక ఉన్న కథ గురించి ఓం రౌత్ మాట్లాడుతూ.. ”ఆదిపురుష్ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది. భారతదేశంలో సినిమా, టీవీ.. అనేకరకాలుగా రామాయణం ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌ జరిగింది. ఆ ఫిలిం ఫెస్టివల్ లో మన ఇతిహాసం రామాయణాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన “ది ప్రిన్స్ ఆఫ్ లైట్” అనే యానిమే వెర్షన్ జపనీస్ సినిమాని చూశాను.”

Adipurush : ప్రభాస్ పేరు రాముడు కాదు.. ‘ఆదిపురుష్’పై ఓంరౌత్ వ్యాఖ్యలు..

”ఆ సినిమా చూసి నేను మైమరచిపోయాను. కథని చాలా బాగా కుదించి, అద్భుతంగా, పిల్లలకి ఈజీగా అర్థమయ్యేలా చెప్పారు. చాలా కొత్తగా, అప్పటి టెక్నాలజీస్ ని అద్భుతంగా వాడి చెప్పారు. ఈ విదేశీయులు మన ఇతిహాసాన్ని ఇంత ఆసక్తికరమైన అంశంగా చేసి చూపిస్తుంటే మనం మాత్రం ఏం చేస్తున్నాం? అందుకే మనం కూడా ఇలాంటివి చేయాలి అనుకున్నాను. అప్పుడే మన రామాయణాన్ని నా స్వంత మార్గంలో చెప్పాలి అని ఫిక్స్ అయ్యాను” అని తెలిపారు.

Vijayawada : దుర్గమ్మ సన్నిధిలో సాయిధరమ్ తేజ్.. యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి బయటకు..

అప్పుడెప్పుడో 20 సంవత్సరాల క్రితం అనుకోని ఇప్పుడు ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు ఓంరౌత్. 400 కోట్లతో తెరకెక్కుతున్న “ఆదిపురుష్” సినిమా 2022 చివర్లో రిలీజ్ అవుతుందని, పాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవ్వనుంది తెలిపారు డైరెక్టర్ ఓంరౌత్.

ట్రెండింగ్ వార్తలు