Novak Djokovic : జొకోవిచ్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. ఎయిర్ పోర్టులోనే నిలిపేశారు..!

ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు వచ్చిన జోకోవిచ్‌ను మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులో నిలిపేశారు.

Novak Djokovic : ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు, డిఫెండింగ్‌ చాంపియన్ నోవాక్ జొకోవిచ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు వచ్చిన జోకోవిచ్‌ను మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులో నిలిపేశారు. దాంతో రాత్రంతా మెల్‌బోర్న్‌లోని తుల్లామరైన్ విమానాశ్రయంలో జొకోవిచ్ ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. టోర్నీ కోసం ప్రత్యేక వైద్య మినహాయింపుతో ఆస్ట్రేలియాలో దిగాడు. కోవిడ్ టీకా ఒక్క డోసు కూడా తీసుకోలేదు. అయినప్పటికీ ఆరంభ గ్రాండ్ స్లామ్ ఆడేందుకు మినహాయింపు కావాలని అప్లయ్ చేసుకున్నాడు. అందుకు అధికారులు కూడా అనుమతినిచ్చారు.

ఆస్ట్రేలియా వీసా దరఖాస్తులో టీకా తీసుకోకపోవడానికి గల సరైన కారణాలను చూపించాల్సిందే. కానీ, ఈ విషయంలో జొకోవిచ్ పొరపాటు చేశాడు. ఆస్ట్రేలియా వీసా పొందాలంటే స్క్రూటినీ చేశాకే మంజూరు అవుతుంది. దీని కారణంగానే జొకోవిచ్‌ను మెల్‌బోర్న్‌ విమానాశ్రయంలో నిలిపివేశారు. టెన్నిస్ స్టార్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం తన వీసా నిరాకరించినట్టు లేఖ జారీ చేసిందని టోర్నమెంట్‌కు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కోవిచ్ దేశంలోకి ప్రవేశించడానికి ఉపయోగించిన వీసా పేపర్‌వర్క్ ఇప్పటికే వచ్చిన మరో ముగ్గురు ఆటగాళ్ల మాదిరిగానే ఉన్నాయని నివేదికలు తెలిపాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో కాన్‌బెర్రా బెల్‌గ్రేడ్ మధ్య దౌత్యపరమైన సంఘటనకు దారితీసే ప్రమాదం ఉందని, అతడికి ప్రత్యేక అనుమతులతో ఆస్ట్రేలియాలో టోర్నీ ఆడేందుకు అనుమతించాలని సెర్బియా అధ్యక్షుడు Aleksandar Vucic డిమాండ్ చేశారు.

Read Also : Voters List : తెలంగాణలో ఎంత మంది ఓటర్లున్నారో తెలుసా..?

ట్రెండింగ్ వార్తలు