Five States Election : మళ్ళీ ఆంక్షల వలయం..ఎన్నికలు నిర్వహించాలా ? వద్దా ?

ఒమిక్రాన్‌ వ్యాప్తితో యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించాలని, అలాగే, ఎన్నికలను కూడా వాయిదా వేయాలని

Election Commission : దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం – కేంద్ర ఆరోగ్యశాఖతో సమావేశంకానుంది. ఈ నెల 27న కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో జరగబోయే సమావేశంలో.. దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌ ప్రభావం తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. అలాగే, యూపీ, పంజాబ్‌ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Read More : Uttar Pradesh : లక్ష మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌‌లు

ఒమిక్రాన్‌ వ్యాప్తితో యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించాలని, అలాగే, ఎన్నికలను కూడా వాయిదా వేయాలని అలహాబాద్‌ హైకోర్టు కేంద్రం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. దీంతో ఎన్నికల సంఘం, ఆరోగ్యశాఖ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న యూపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా.. వీలైతే రెండు నెలల పాటు వాయిదా వేయాలంటూ అలహాబాద్‌ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. మనుషులు ప్రాణాలతో ఉంటేనే కదా.. ప్రచారాలైనా.. ఎన్నికలైనా. ఒకవేళ ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే రెండో దశ కంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు