Uttar Pradesh : లక్ష మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌‌లు

తొలివిడతలో భాగంగా గ్రాడ్యుయేషన్, పారా గ్రాడ్యుయేషన్ చదివిన లక్ష మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీటిని అందచేశారు...

Uttar Pradesh students : ఒకరు కాదు..ఇద్దరు కాదు..వేల మంది కాదు..ఏకంగా లక్ష మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లను ప్రభుత్వం పంపిణీ చేసింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా..వీటిని యూపీ గవర్నమెంట్ అందించింది. రాష్ట్రంలో కోటి మందికి విద్యార్థులకు ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా తొలివిడతలో భాగంగా గ్రాడ్యుయేషన్, పారా గ్రాడ్యుయేషన్ చదివిన లక్ష మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీటిని అందచేశారు. లఖ్ నవ్ లోని ఏకానా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.

Read More : Omicron : ఒమిక్రాన్‌పై బిగ్ రిలీఫ్.. 90శాతం మందిలో లక్షణాలే లేవు, చికిత్స కూడా అవసరం లేదు

స్టేడియం మొత్తం విద్యార్థులతో నిండిపోయింది. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పోటెత్తారు. ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ….యువత నిరాశ, నిస్పృహలకు లోను కావొద్దని, విశాలంగా ఆలోచించాలని విద్యార్థులకు సూచించారు. ఆలోచనలను ఎప్పుడూ పరిమితంగా ఉండొద్దని, ఆసక్తితో పని చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారన్నారు. జీవితాల్లోకి నిరాశను దరి చేరదీస్తే..పైకి రాలేరన్నారు. ఈ కార్యక్రమంలోనే…ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయ్ చానుకు రూ. 1.5 కోట్లను ప్రభుత్వం అందించింది. అంతేగాకుండా ఘనంగా సత్కరించింది. ఆమెతో పాటు…కోచ్ విజయ్ కుమార్ కు రూ. 10 లక్షలను అందించింది.

Read More : Punjab Election : పంజాబ్‌‌లో రైతు సంఘాల కీలక నిర్ణయం, ఎన్నికల్లో పోటీ

కోటి మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లను పంపిణీ చేయనున్నట్లు ఇటీవలే యూపీ సర్కార్ ప్రకటించింది. తొలి విడతలో 60 వేల స్మార్ట్ ఫోన్లు, 40 వేల ట్యాబ్ లను విద్యార్థులకు అందించింది. ఈ సందర్భంగా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. 38 లక్షల మందికి పైగా విద్యార్థులు డీజీ శక్తి పోర్టల్ లో పేర్లు నమోదు చేయించుకున్నట్లు యూపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కుమార్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు