Video: కుమారి ఆంటీలా స్ట్రీట్ ఫుడ్‌ నడుపుతున్న 10 ఏళ్ల బాలుడు.. బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్ర

అతడికి 14 ఏళ్ల అక్క కూడా ఉంది. తమ తల్లికూడా తమను వదిలి పెట్టి వెళ్లిపోయిందని చెప్పాడు.

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ యంగ్ జనరేషన్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్ర తాజాగా ఓ బాలుడి వీడియోను షేర్ చేశారు. స్ట్రీట్ ఫుడ్ తయారు చేస్తూ ఈ వీడియోలో ఆ బాలుడు కనపడ్డాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

చదువుకునే వయసులో ఆ బాలుడు స్ట్రీట్ ఫుడ్ బండి వద్ద పనిచేస్తున్న తీరుపై ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ… “ఈ బాలుడికి చాలా ధైర్యం ఉంది. అతడి పేరు జస్ప్రీత్. అయితే, అతని చదువు పాడుకాకూడదు. ఆ బాలుడు ఢిల్లీలోని తిలక్ నగర్‌లో ఉంటాడని తెలుస్తోంది. ఎవరికైనా అతడి కాంటాక్ట్ నంబర్‌ తెలిస్తే దయచేసి షేర్ చేయండి. మహీంద్రా ఫౌండేషన్ టీమ్ అతడికి చదువులో ఎలా సాయపడగలదో ఆలోచిస్తుంది” అని చెప్పారు.

వీడియోలో కనపడుతున్న బాలుడు జస్ప్రీత్ కి 10 ఏళ్ల వయసు ఉంటుంది. అతడు ఎగ్ రోల్‌ను తయారు చేస్తూ కనపడుతున్నాడు. తన తండ్రి ఇటీవల ఓ వ్యాధితో మరణించాడని ఆ బాలుడు చెప్పాడు. అతడికి 14 ఏళ్ల అక్క కూడా ఉంది. తమ తల్లికూడా తమను వదిలి పెట్టి వెళ్లిపోయిందని చెప్పాడు. అయినప్పటికీ జస్ప్రీత్ ఉదయం పూట పాఠశాలకు వెళ్తున్నాడు. సాయంత్రం స్ట్రీట్ ఫుడ్ బండి నడుపుతూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నాడు.

భారత్‌లో ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్ర

ట్రెండింగ్ వార్తలు