Nana Patekar Help Farmers : రైతుల పాలిట ఆపద్బాంధవుడు నానా పటేకర్.. అన్నదాతలకోసం ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలివే.. కోటిన్నర కారునుసైతం..
Nana Patekar Help Farmers : నానా పటేకర్ రైతుల కోసం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్థిక సహాయం అందించి వారికి అండగా నిలిచారు.
Nana Patekar Help Farmers
Nana Patekar Help Farmers : బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూతతో సినీ ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెరపై తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. తెరవెనుక మాత్రం రైతులు, పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆయా వర్గాలకు ఆపద్బాంధవుడిగా నిలిచారు. నానా పటేకర్ మరణంతో ఆయన రైతులకోసం చేసిన గొప్ప కార్యక్రమాలను గుర్తు చేసుకుంటున్నారు.
నానా పటేకర్ రైతులకోసం అనేక గొప్ప కార్యక్రమాలను నిర్వహించారు. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలను చూసి చలించిపోయిన ఆయన తోటి నటుడు మకరంద్ అనాస్పురేతో కలిసి ‘నామ్ ఫౌండేషన్’ స్థాపించి వేలాది రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారు. ఫౌండేషన్ ప్రారంభమైన కొద్దికాలంలోనే భారీగా విరాళాలు వచ్చాయి. కేవలం రెండు నెలల్లోనే దాదాపు రూ.60 కోట్ల మేర నిధులు సమకూరినట్లు ఆయన అప్పట్లో ప్రకటించారు. ఈ సాయం వెనుక పెద్ద పారిశ్రామికవేత్తల కంటే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని ఆయన అప్పట్లో చెప్పారు. సంపాదనలో సింహభాగం రైతుల సంక్షేమం కోసమే వెచ్చించారంటే ఆయనకు రైతులంటే ఎంత అభిమానమో ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు.
2015లో మహారాష్ట్రలో కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు ఆయన్ను తీవ్రంగా కలచివేశాయి. అదే సమయంలో నానా పటేకర్ ఓ లగ్జరీ కారును కొనాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం దాదాపు రూ.1.5 కోట్లు కేటాయించారు. అయితే, ఓ రోజు టీవీలో రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని చూపించిన వార్తా కథనం ఆయన ఆలోచననే మార్చేసింది.
రైతు కుటుంబ సభ్యుల ముఖాల్లో కనిపించిన ఆకలి, బాధ నానా పటేకర్‌ను తీవ్రంగా కలచివేసింది. తాను లగ్జరీ కారుకోసం ఇంత డబ్బు ఖర్చు చేయడం అవసరమా? అని తన ఆలోచనను విరమించుకొని.. ఆ మొత్తాన్ని (రూ.కోటిన్నర) ఇబ్బందుల్లో ఉన్న రైతులకు సహాయం చేశారు.
నాందేడ్, పర్బని, హింగోలి, లాతూర్, ఉస్మానాబాద్ లాంటి కరువు జిల్లాల్లో నానా పటేకర్ పర్యటించి వందలాది రైతుల కుటుంబాలకు చెక్కులతోపాటు దుప్పట్లు, వస్త్రాలు, మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. అంతేకాదు.. వితంతువులైన రైతు భార్యలకు కుట్టు మిషన్లు, ఫ్లోర్ మిల్లులు, మేకలు అందజేసి స్వయం ఉపాధి కల్పించారు. రైతుల పిల్లల విద్యకోసం, వివాహాల కోసం ఆర్థిక సహాయం చేయడంతోపాటు మెడికల్ కార్డుల ద్వారా ఉచిత వైద్యం అందించారు.
రైతులు ఎదుర్కొంటున్న కరువు సమస్యను శాశ్వతంగా తరిమేసేందుకు దిశ ఫౌండేషన్ తరపున కరువు ప్రాంతాల్లోని ఎండిపోయిన చెరువులు, నదులు, నాలాల పూడికతీత పనులను భారీ ఎత్తున చేపట్టారు. ఎన్నో గ్రామాలను దత్తత తీసుకొని రైతులకు ప్రత్యేక శిక్షణ, ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నటుడిగా పటేకర్‌కు ఎన్నో అవార్డులు, గౌరవాలు దక్కాయి. కానీ, రైతులకోసం పనిచేయడం తనకు సినిమాల ద్వారా వచ్చిన డబ్బు, అవార్డుల కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందని ఆయన గతంలో చెప్పారు. 2026 మేలో నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా నామ్ ఫౌండేషన్ తనకు ఇచ్చిన ఆనందం సినిమాల్లో సంపాదించిన డబ్బు, అవార్డుల కంటే గొప్పదని నానా పేర్కొన్నారు.
