Satyapal Malik : జంతువు చనిపోతే సంతాపాలు ప్రకటించిన ఢిల్లీ నేతలు 600మంది రైతులు చనిపోతే పట్టించుకోరా

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.

Satyapal Malik నూతన వ్యవసాయ చట్టాల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి మొదటినుంచి సత్యపాలిక్ మాలిక్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఆదివారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సత్యపాలిక్ మాలిక్..ఒక జంతువు చనిపోతే సంతాపాలు ప్రకటించిన ఢిల్లీ నేతలు..ఉద్యమంలో పాల్గొన్న 600 మంది రైతులు చనిపోతే ఒక్క మాటైనా మాట్లాడటం లేదన్నారు. 600 మంది రైతులు మరణించినప్పటికీ వారి ప్రతిపాదనను ఇప్పటి వరకు లోక్‌సభ ఎందుకు ఆమోదించలేదని గవర్నర్ ప్రశ్నించారు. తాను వ్యవసాయ చట్టాలపై ఏది మాట్లాడినా వివాదాస్పదమవుతోందని గవర్నర్ అన్నారు.

మరోవైపు, గవర్నర్‌ పదవి నుంచి ఆయనను తొలగించవచ్చంటూ వస్తున్న వదంతులపై కూడా సత్యపాల్ మాలిక్ స్పందించారు. ఢిల్లీ నుంచి పిలుపు కోసం వారాల తరబడి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. “ఒక గవర్నర్‌ను తొలగించలేరు.. కానీ నా శ్రేయోభిలాషులు ఏదో చెప్పాలని ఎదురు చూస్తున్నారు.. ఢిల్లీ పెద్దలు నన్ను వెళ్లిపోమని చెప్పిన రోజు.. నేను అలా చేస్తాను” అని సత్యపాలిక్ మాలిక్ అన్నారు.

కాగా, గతంలో జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ పని చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు అనంతరం దేశాన్ని కుదిపివేసిన ఆ పరిణామాలను సత్యపాల్ మాలిక్ దగ్గర ఉండి చూసుకున్నారు. అనంతరం ఆయనను మేఘాలయ గవర్నర్‌గా బదిలీ చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీగా రెండు సార్లు మాలిక్ సేవలందించారు.

ALSO READ Taliban Airforce : సొంత ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు దిశగా తాలిబన్

ట్రెండింగ్ వార్తలు