F3 Movie: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, హాట్ బ్యూటీ మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘ఎఫ్ 2’..
ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాకి సీక్వెల్గా మరింత ఫన్తో థియేటర్లలో మరోసారి నవ్వులజల్లు కురిపించడానికి ‘ఎఫ్3’ రెడీ అవుతోంది. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ పున: ప్రారంభమైంది.
ప్రస్తుతం ప్రధాన తారాగణమంతా పాల్గొంటుండగా ఫన్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నట్లు మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ ‘ఎఫ్ 3’ మూవీకి కెమెరా : సాయి శ్రీరామ్, ఎటిడింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్.