Karnataka Election Result: కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వార్ ..

సిద్ధరామయ్య, శివకుమార్‌లలో కర్ణాటక సీఎం పీఠం ఎవరిని వరిస్తుందోనన్న అంశంపై కన్నడ రాష్ట్రంలోనేకాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Karnataka CM Seat: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 135 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఏ పార్టీ మద్దతు లేకుండానే అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ.. సీఎం అభ్యర్థి ఎవరనేది కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎంపీఠం కోసం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యలు పోటీ పడుతున్నారు. వీరిలో సిద్ధ రామయ్యవైపు అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరు ఖచ్చితంగా తమకు సీఎం పదవి కావాలని పట్టుబడితే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేదానిపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది.

Karnataka Congress CM: సిద్ధరామయ్య, శివకుమార్‌లలో సీఎం ఎవరు..? అదిరిపోయే ప్లాన్‌లో కాంగ్రెస్.. బెంగళూరుకు రేవంత్ రెడ్డి

సిద్ధరామయ్య, శివకుమార్‌లలో సీఎం పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇరువురి అభిమానులు బెంగళూరులో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం పదవిలో తమ అభిమాన నాయకుడే ఉండాలంటూ ఈ ప్లెక్సీల్లో కోరారు. ఇప్పటికే సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర తన తండ్రి సీఎం పోస్టుకు అర్హుడని అన్నారు. తన తండ్రే కాబోయే సీఎం అని చెప్పేశాడు. మరోవైపు డీకే శివకుమార్ సోదరుడు సురేష్ మాట్లాడుతూ.. శివకుమార్ సీఎం బాధ్యతలు చేపడితే రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతోషిస్తారని చెప్పారు. దీంతో.. సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ సీఎం పీఠంకోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Karnataka Elections Result: రాహుల్ గాంధీ ‘జోడో యాత్ర ’ సాగిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నిచోట్ల గెలిచిందో తెలుసా?

కర్ణాటక సీఎం పీఠం ఎవరికి కట్టబెట్టాలనే విషయంపై అధిష్టానం దృష్టిసారించింది. ఈరోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో సీఎల్పీ భేటీ కానుంది. ఈ సమావేశంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ పాల్గోనున్నారు. ఇప్పటికే వారంతా బెంగళూరుకు చేరుకున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకొని సీఎం అభ్యర్థి విషయంలో అధిష్టానం తుదినిర్ణయం తీసుకోనుంది.

ట్రెండింగ్ వార్తలు