Folk Songs : ‘సారంగ దరియా’ నుండి ‘దిగు దిగు దిగు నాగ’ వరకు ఊపు ఊపుతున్న ఫోక్ సాంగ్స్..

మన మ్యుజిషియన్స్ మాస్ మసాలా బీట్స్ మీద బాగా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు.. ఆడియన్స్‌లో కాస్త జోష్ నింపేందుకు ఫోక్ మీద ఫోకస్ చేస్తున్నారు..

Folk Songs: తెలుగు సినిమా ట్రెండ్ మారుతుంది. క్లాస్ మ్యూజిక్, ఇప్పుడు బోర్ కొడుతోంది. అందుకే మన మ్యుజిషియన్స్ మాస్ మసాలా బీట్స్ మీద బాగా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. ఆడియన్స్‌లో కాస్త జోష్ నింపేందుకు ఫోక్ మీద ఫోకస్ చేస్తున్నారు. సిచ్యువేషన్ ఏదైనా పాపులర్ ఫోక్ సాంగ్స్‌తో హిట్ కొడుతున్నారు. టాలీవుడ్‌లో లేటెస్ట్‌గా వినిపిస్తున్న ఫోక్ సాంగ్స్ ఏంటో చూద్దాం.

పాప్ సాంగ్స్ కన్నా, ఫోక్ సాంగ్స్ మీద మనసు పారేసుకుంటున్నారు జనాలు. పార్టీ సాంగ్స్ కన్నా మసాలా బీట్స్‌కే ఎక్కువ ఎట్రాక్ట్ అవుతున్నారు ఆడియన్స్. అందుకే ఈ మధ్య కంపోజర్స్ అందరూ ఫోక్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా నాగ శౌర్య హీరోగా థమన్ మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్న ‘వరుడు కావలెను’ సినిమాలో ‘దిగు దిగు దిగు నాగ’ పాట టీజర్‌తోనే తెగ వైరల్ అవుతోంది.

 

నాగశౌర్య ‘దిగు దిగు దిగు నాగ’ అంటే ఈ హీరో మాత్రం మాత్రం ‘మందులోడా, ఓరి మాయలోడా’.. అంటూ ఫుల్ జోష్‌లో పాట రిలీజ్ చేశారు. సుధీర్ బాబు, కరుణ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో ఐటమ్ సాంగ్‌గా రిలీజ్ అయిన ‘మందులోడా’ ఫోక్ సాంగ్.. సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యి రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది.

Sridevi Soda Center: మెగాస్టార్ విడుదల చేసిన సుధీర్ బాబు మందులోడా సాంగ్!

పాటల విషయంలో పెద్దగా ప్రయోగాలు చెయ్యని మాస్ హీరో గోపీచంద్ కూడా ఈ సారి మాంచి తెలంగాణ ఫోక్ సాంగ్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కిన ‘సీటీ మార్’ సినిమాలో ‘జ్వాలా రెడ్డి’ పాట.. తెలంగాణలో పాపులర్ అయిన పోరు తెలంగాణను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుని తెరకెక్కించారు.

ఈ సీజన్‌లో రిలీజ్ అయిన ఫోక్ సాంగ్స్ అన్నింటిలో సూపర్ హిట్ అయిన పాట ‘సారంగ దరియా’.. తన సినిమాల్లో ఫోక్ సాంగ్ ఉండేలా చూసుకునే శేఖర్ కమ్ముల.. ‘లవ్ స్టోరీ’ లో కూడా మాంచి ఫోక్ సాంగ్‌తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ‘సారంగ దరియా’ అంటూ సాగే ఈ అందమైన జానపదానికి సాయి పల్లవి తన యాక్టింగ్‌ని యాడ్ చేసి, అందాన్ని ఇంకాస్త పెంచేయడంతో ఈ పాట రికార్డ్స్ సోషల్ మీడియాలో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు