Naga Chaitanya Mother Lakshmi Changed a Lot Mothers Day Special Photo goes Viral
Naga Chaitanya Mother : నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడు సినిమాల ప్రమోషన్స్ తప్ప బయట ఎక్కువగా కనపడట్లేదు. తాజాగా నేడు మదర్స్ డే సందర్భంగా నాగ చైతన్య తన తల్లి లక్ష్మితో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసాడు. నేడు మదర్స్ డే సందర్భంగా తల్లితో కేక్ కట్ చేయించినట్టు తెలుస్తుంది. ఇవాళ దిగిన ఫోటోనే చైతు షేర్ చేసినట్టు తెలుస్తుంది.
Also Read : Ashwin Babu : ఓంకార్ తమ్ముడు పాన్ ఇండియా సినిమా.. శివుడి రిఫరెన్స్ తో..
తల్లితో నాగ చైతన్య దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే పాత ఫొటోల్లో నాగ చైతన్య తల్లి లక్ష్మిని చూసి, ఇవాళ చైతు షేర్ చేసిన ఫొటోల్లో చూసి ఆవిడే ఈవిడ అంటే నమ్మలేకపొతున్నారు. అంతలా చైతు తల్లి లక్ష్మి మారిపోయారు. దీంతో అభిమానులు, నెటిజన్లు ఈమె ఇంతలా మారిపోయిందేంటి అని షాక్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.