Ashwin Babu : ఓంకార్ తమ్ముడు పాన్ ఇండియా సినిమా.. శివుడి రిఫరెన్స్ తో..

మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు అశ్విన్ బాబు.

Omkar Brother Ashwin Babu New Movie Titled as Shivam Bhaje and First Look Poster Released

Ashwin Babu : రాజుగారి గది, హిడింబ.. పలు సినిమాలతో ప్రేక్షకులని మెప్పించాడు అశ్విన్ బాబు. ఓంకార్ తమ్ముడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన అశ్విన్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల హిడింబ సినిమాతో వచ్చి అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ కథతో మెప్పించాడు. త్వరలో మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు అశ్విన్ బాబు.

గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘శివం భజే’. తాజాగా నేడు ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అశ్విన్ బాబు ఒంటి కాలి మీద నిలబడి ఒంటిచేత్తో మనిషిని ఎత్తేసి రౌద్ర రూపంలో ఉండగా వెనక అఘోరాలు, త్రిశూలాలు, చీకట్లో కాగడాలు, దేవుడి విగ్రహం.. ఉన్నాయి. ఈ పోస్టర్ తో సినిమాపై ఆసక్తి నెలకొంది. ‘శివం భజే’ టైటిల్, పోస్టర్ చూస్తుంటే శివుడి రిఫరెన్స్ తో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Tollywood Voting : రేపు ఏ ఏ సినిమా సెలబ్రిటీ ఎక్కడెక్కడ ఓటు వేస్తున్నారంటే..?

ఇక ‘శివం భజే’ టైటిల్, పోస్టర్ లాంచ్ సందర్భంగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక కొత్త కథతో అశ్విన్ బాబు హీరోగా ఈ ‘శివం భజే’ సినిమా తెరకెక్కిస్తున్నాం. టైటిల్, ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వస్తుంది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టవల్-24 లో బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు అందుకున్న దాశరథి శివేంద్ర ఈ సినిమాకి అదిరిపోయే సినిమాటోగ్రఫీ చేశారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాం అని తెలిపారు. ఇక ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.