Tollywood Voting : రేపు ఏ ఏ సినిమా సెలబ్రిటీ ఎక్కడెక్కడ ఓటు వేస్తున్నారంటే..?

రేపు మన సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఎక్కడెక్కడ తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారంటే..

Tollywood Voting : రేపు ఏ ఏ సినిమా సెలబ్రిటీ ఎక్కడెక్కడ ఓటు వేస్తున్నారంటే..?

Tollywood Celebrities Voting Places Full Details Here

Updated On : May 12, 2024 / 2:33 PM IST

Tollywood Voting : ప్రస్తుతం దేశమంతా ఎన్నికల హంగామా నడుస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్లంతా రేపు పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓటు వేయడానికి రెడీ అయ్యారు. ఏపీలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం కేవలం పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక మన సినీ సెలబ్రిటీలు చాలా మందికి ఇక్కడే హైదరాబాద్ లో ఓటు ఉంది.

Also Read : Sridevi : ముంబైలో ఓ చౌరస్తాకు శ్రీదేవి పేరు.. ఆమెపై గౌరవంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్..

రేపు మన సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఎక్కడెక్కడ తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారంటే..

ఓబుల్‌రెడ్డి స్కూల్‌‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి, జూబ్లీహిల్స్ లో BSNL సెంటర్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్‌, జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌, విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌, జీవిత, రాజశేఖర్, FNCC కార్యాలయంలో రాఘవేంద్రరావు, విశ్వక్‌సేన్‌, దగ్గుబాటి రానా, సురేశ్‌ బాబు, జూబ్లీహిల్స్‌ క్లబ్‌ లో చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, నితిన్‌, జూబ్లీ హిల్స్ న్యూ ఎమ్మెల్యే కాలనీలో రవితేజ, వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌, మణికొండ హైస్కూల్ లో వెంకటేశ్, బ్రహ్మానందం, షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రాజమౌళి, రమా రాజమౌళి, బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో రామ్ పోతినేని, గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాల లో హీరో నాని, దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో హీరో సుధీర్ బాబు, జూబ్లీహిల్స్‌ ఆర్థిక సహకార సంస్థ కార్యాలయంలో అల్లరి నరేశ్‌, యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాలలో తనికెళ్ల భరణి.. తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు.