Yakshini Web Series : మంచులక్ష్మితో బాహుబలి నిర్మాత వెబ్ సిరీస్.. భయపెట్టడానికి వచ్చేస్తున్నారు..

బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ నుంచి మరో వెబ్ సిరీస్ రాబోతున్నట్టు ప్రకటించారు.

Baahubali Producer Shobu Yarlagadda announced new Web Series with Manchu lakshmi and Vedika

Yakshini Web Series : ఇటీవల బాహుబలి(Baahubali) నిర్మాత శోభు యార్లగడ్డ(Shobu Yarlagadda) యానిమేషన్ సిరీస్ రాబోతున్నట్టు ప్రకటించి బాహుబలి – క్రౌన్ ఆఫ్ ది బ్లడ్ అనే టైటిల్ తో ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. బాహుబలి – క్రౌన్ ఆఫ్ ది బ్లడ్ సిరీస్ మే 17 నుంచి డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ నుంచి మరో వెబ్ సిరీస్ రాబోతున్నట్టు ప్రకటించారు. ‘యక్షిణి’ అనే ఆసక్తికర టైటిల్ తో ఈ సిరీస్ ని ప్రకటించారు. యక్షిణి వస్తుంది జాగ్రత్త అంటూ హాట్ స్టార్ ఈ సిరీస్ గురించి పోస్ట్ చేసింది.

Also Read : Payal Rajput : మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతున్న పాయల్.. ఈసారి పోలీసాఫీసర్‌గా..

యక్షిణి వెబ్ సిరీస్ ని బాహుబలి సినిమాని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి(Manchu Lakshmi), రాహుల్ విజయ్, అజయ్ ముఖ్య పాత్రల్లో ఈ సిరీస్ తెరకెక్కుతుంది. అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్.. లాంటి సినిమాలతో దర్శకుడిగా మెప్పించిన తేజ మార్ని దర్శకత్వంలో ఈ ‘యక్షిణి’ సిరీస్ తెరకెక్కింది. సోషియో ఫాంటసీ కథతో హారర్ ఎలిమెంట్స్ జతచేసి ఈ యక్షిణి సిరీస్ ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

తాజాగా టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది యక్షిణి సిరీస్. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ కానుంది.