Karnataka Polls: బీజేపీలో చేరిన మాజీ స్పీకర్ కూతురు.. దురదృష్టకరమన్న తండ్రి తిమ్మప్ప

కాంగ్రెస్ పార్టీలో తనను గుర్తిస్తారని చాలా ఎదురుచూశానని, అయితే తనను బీజేపీ గుర్తించిందని, అందుకే కమలదళంలో చేరానని రాజనందిని చెప్పారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల గడువు సమీపిస్తున్నా కొద్ది, రాజకీయ పార్టీల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అటు వైపు ఉన్న నేతలు ఇటు వైపు.. ఇటు వైపు ఉన్న నేతలు అటు వైపు జంప్ చేస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కాస్త జోరుగానే కనిపించింది. పలువురు బీజేపీ నేతల్ని తమ పార్టీలోకి తీసుకున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు మాజీ స్పీకర్ తిమ్మప్ప కూతురు రాజనందిని. బుధవారం ఆమె హస్తం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈ పరిణామంపై తిమ్మప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలా వెళ్లడం దురదృష్టకరమని అన్నారు.

Lok Sabha Elections 2024: విపక్షాల ఐక్యతలో కీలక ఘట్టం.. కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ కీలక ప్రకటన

కాంగ్రెస్ పార్టీలో తనను గుర్తిస్తారని చాలా ఎదురుచూశానని, అయితే తనను బీజేపీ గుర్తించిందని, అందుకే కమలదళంలో చేరానని రాజనందిని చెప్పారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. కాగా, తన కూతురు బీజేపీలో చేరినంత మాత్రాన తాను కాంగ్రెస్‭ వాదినేనని తిమ్మప్ప అన్నారు. తన కుమార్తె ఇంత పని చేస్తుందని తాను ఊహించలేకపోయానని అన్నారు. ఇది ముమ్మాటికీ బీజేపీకి చెందిన హలప్ప పనే అయ్యుంటుందని తిమ్మప్ప అనుమానం వ్యక్తం చేశారు.

Ameerpet Metro Station: అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ లో ఇదీ పరిస్థితి.. కేటీఆర్ కు ప్రయాణికుడి ట్వీట్

ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నాలుగు రోజులుగా కసరత్తు అనంతరం ఎట్టకేలకూ 189 మంది అభ్యర్థులతో తొలి జాబితా రూపొందించి విడుదల చేసింది. సీఎం బసవరాజ్‌ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర పలువురు ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. కాగా, ఇందులో 52 మంది కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చారు. మొత్తంగా 8 మంది మహిళలకు అవకాశం కల్పించారు. 32 ఓబీసీలకు, 30 ఎస్సీలకు, 16 ఎస్టీలకు టికెట్లు ఇచ్చారు. వరుణలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మంత్రి వి.సోమన్న తలపడనున్నారు. అలాగే కనకపురలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై మరో మంత్రి ఆర్‌.అశోక బరిలోకి దిగనున్నారు.

ట్రెండింగ్ వార్తలు