Bad Newz Trailer : ఒకే బిడ్డకు ఇద్దరు తండ్రులు.. యానిమల్ భామ త్రిప్తి దిమ్రి కొత్త సినిమా ట్రైలర్ చూశారా? ఫుల్ కామెడీ..

త్రిప్తి దిమ్రి త్వరలో 'బ్యాడ్ న్యూస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా బ్యాడ్ న్యూస్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Vicky Kaushal Triptii Dimri Bad Newz Movie Trailer Released

Bad Newz Trailer : రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది త్రిప్తి దిమ్రి. అంతకుముందు కొన్ని సినిమాలు చేసినా ఈ సినిమాతో బాగా పేరొచ్చింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరగడమే కాక అనేక సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. త్రిప్తి దిమ్రి త్వరలో ‘బ్యాడ్ న్యూస్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

త్రిప్తి దిమ్రి, విక్కీ కౌశల్, అమ్మి విరాక్ మెయిన్ లీడ్స్ లో ఆనంద్ తివారి దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో బ్యాడ్ న్యూస్ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా బ్యాడ్ న్యూస్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Kamal Haasan : పార్ట్ 2లో ఎక్కువ సేపు కనిపిస్తాను.. పార్ట్ 3 కూడా.. కల్కి సినిమాపై కమల్ హాసన్ వ్యాఖ్యలు..

ఈ ట్రైలర్ లో.. హీరోయిన్ కి ప్రగ్నెన్సీ వస్తే ఇద్దరు హీరోల్లో ఎవరు తండ్రో తెలియక అయోమయంలో ఉంటే పెటర్నిటీ టెస్ట్ చేస్తారు. దీంట్లో పుట్టబోయే బిడ్డకు ఇద్దరూ తండ్రులే అని వస్తుంది. దీంతో హీరోయిన్ తో ఏ హీరో లైఫ్ లాంగ్ ఉంటారు? ఎవరు వదిలేస్తారు? ఆ బిడ్డని తండ్రిగా ఎవరు ఒప్పుకుంటారు.. అనే కథాంశంతో కామెడీ, ఎమోషన్ తో తెరకెక్కించినట్టు చూపించారు. మరి ఈ కామెడీ సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. మీరు కూడా బ్యాడ్ న్యూస్ ట్రైలర్ చూసేయండి..