Kamal Haasan : పార్ట్ 2లో ఎక్కువ సేపు కనిపిస్తాను.. పార్ట్ 3 కూడా.. కల్కి సినిమాపై కమల్ హాసన్ వ్యాఖ్యలు..

కల్కి సినిమా పార్ట్ 2 ఉందని, కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయని కల్కి క్లైమాక్స్ లో ప్రకటించారు.

Kamal Haasan : పార్ట్ 2లో ఎక్కువ సేపు కనిపిస్తాను.. పార్ట్ 3 కూడా.. కల్కి సినిమాపై కమల్ హాసన్ వ్యాఖ్యలు..

Kamal Haasan Interesting Comments on Kalki 2898AD Movie and his Character

Updated On : June 29, 2024 / 8:36 AM IST

Kamal Haasan : ప్ర‌భాస్ కల్కి 2898AD జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీగా రిలీజయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్ లో కల్కి సినిమా తీసాడని అంటున్నారు ప్రేక్షకులు. ఇక కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. మొదటి రోజే కల్కి సినిమా 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది.

ఇక కల్కి సినిమా పార్ట్ 2 ఉందని, కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయని కల్కి క్లైమాక్స్ లో ప్రకటించారు. కల్కి సినిమాలో కమల్ హాసన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న సుప్రీమ్ యాస్కిన్ అనే పాత్రని చేసారు. అయితే కల్కి 2898AD సినిమాలో కమల్ హాసన్ మొత్తం మీద 10 నిముషాలు కూడా కనపడరు. కానీ క్లైమాక్స్ లో కమల్ హాసన్ కి ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తే పార్ట్ 2 మొత్తం కమల్ కనిపిస్తాడని, భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందని తెలుస్తుంది.

Also Read : NBK 109 Shooting Update : బాలయ్య NBK109 షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?

తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి మాట్లాడారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్ర నాకు నచ్చింది. ఇటివంటి పాత్ర అంతకుముందెప్పుడు చేయలేదు. పార్ట్ 1 లో కాసేపే కనిపించాను. ఈ సినిమాకి నేను పనిచేసింది కూడా చాలా తక్కువ రోజులు. పార్ట్ 3 లో, పార్ట్ 2లో ఇంకా ఎక్కువ కనిపిస్తాను. డబ్బుల కోసం ఈ సినిమా చేయలేదు. డబ్బులు సంపాదిస్తాం, పోగొట్టుకుంటాం. కానీ ఈ కథ, పాత్ర నచ్చింది, ఆ టీమ్ పై నాకు నమ్మకం కుదిరింది. ఆల్రెడీ కల్కి 2 కి సైన్ చేశాను అని అన్నారు. అయితే మొదట కల్కి పార్ట్ 3 అని సారీ చెప్పి పార్ట్ 2 అనడంతో పార్ట్ 3 కూడా ఉందని, ఫ్లోలో కమల్ చెప్పేశారని భావిస్తున్నారు. ఎలాగో కల్కి సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించారు కాబట్టి చాలా సినిమాలు ఉంటాయని తెలుస్తుంది.