NBK 109 Shooting Update : బాలయ్య NBK109 షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
ఇటీవల ఎన్నికల సమయంలో బాలయ్య షూటింగ్స్ కి కొంచెం గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు బాలయ్య డేట్స్ ఇవ్వడంతో శరవేగంగా NBK 109 సినిమా షూట్ జరుగుతుంది.

Balakrishna Director Bobby NBK 109 Movie Shooting Update
NBK 109 Shooting Update : బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమాల్లోబ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ కొట్టారు. రాజకీయాల్లో బ్యాక్ టు బ్యాక్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య నిర్మాణంలో బాలకృష్ణ 109వ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే NBK 109 సినిమా రెండు గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ తో మరోసారి బాలయ్య మాస్ సినిమాతో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఎన్నికల సమయంలో బాలయ్య షూటింగ్స్ కి కొంచెం గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు బాలయ్య డేట్స్ ఇవ్వడంతో శరవేగంగా NBK 109 సినిమా షూట్ జరుగుతుంది.
Also Read : Swapna Dutt : మేము రికార్డుల కోసం సినిమా తీయలేదు.. కల్కి సినిమాపై నిర్మాత స్వప్న దత్ సంచలన పోస్ట్..
ప్రస్తుతం బాలకృష్ణ NBK 109 సినిమా షూటింగ్ కర్నూల్ జిల్లా ఓర్వకల్లులోని రాక్ గార్డెన్లో జరుగుతుంది. ఇక్కడ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నట్టు సమాచారం. విలన్స్ తో గన్ ఫైర్, గుర్రపు స్వారీలతో షూట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక బాలయ్య బాబు షూటింగ్ జరుగుతుండటంతో భారీగా జనాలు వచ్చారు. దీంతో పోలీస్ బందోబస్తు నడుమ షూటింగ్ జరుగుతుంది.