Swapna Dutt : మేము రికార్డుల కోసం సినిమా తీయలేదు.. కల్కి సినిమాపై నిర్మాత స్వప్న దత్ సంచలన పోస్ట్..

నిర్మాత స్వప్న దత్ కల్కి కలెక్షన్స్, రికార్డ్స్ గురించి స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

Swapna Dutt : మేము రికార్డుల కోసం సినిమా తీయలేదు.. కల్కి సినిమాపై నిర్మాత స్వప్న దత్ సంచలన పోస్ట్..

Kalki 2898 AD Movie Producer Swapna Dutt Reacts on asking about Collections and Records

Swapna Dutt : ప్రభాస్ కల్కి సినిమాని వైజయంతో మూవీస్ బ్యానర్లో అశ్వినిదత్ ఆధ్వర్యంలో ఆయన ఇద్దరు కూతుళ్లు ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించారు. ప్రమోషన్స్ లో కూడా ఈ ఇద్దరూ పాల్గొన్నారు. ఇక కల్కి 2898AD సినిమా థియేటర్స్ లో హిట్ టాక్ తో సందడి చేస్తుంది. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్.. అన్ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని పొగిడేస్తున్నారు.

ఇక మొదటి రోజు అయిందంటే ఏ సినిమా అయినా కలెక్షన్స్ గురించే మాట్లాడతారు. అందులో ప్రభాస్ సినిమా అయితే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఎన్ని రికార్డులు సెట్ చేసిందనే మాట్లాడతారు. కల్కి సినిమా మొదటి రోజు 180 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని బాక్సాఫీస్ సమాచారం. ఇప్పటికే పలు చోట్ల కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డ్స్ సెట్ చేసింది కల్కి.

Also Read : Prabhas : ప్రభాస్ ఒక్కడే ఆ రికార్డ్ సెట్ చేసిన ఇండియన్ హీరో.. ఏకంగా 5 సార్లు..

అయితే కల్కి కలెక్షన్స్ అధికారికంగా మూవీ యూనిట్ పోస్ట్ చేయలేదు. దీంతో పలువురు నిర్మాతలను కలెక్షన్స్ గురించి అడుగుతున్నట్టు సమాచారం. దీనిపై నిర్మాత స్వప్న దత్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

స్వప్న దత్ తన పోస్ట్ లో.. నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలామంది నాకు కాల్ చేసి రికార్డ్స్ క్రాస్ చేశామా అని అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ రికార్డులు సృష్టించిన వాళ్ళెవరూ ఆ రికార్డుల కోసం సినిమాలు తీయరు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ప్రేమతో సినిమాలు తీస్తారు. మేము కూడా అలాగే తీసాం అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే స్వప్న దత్ చేసిన పోస్ట్ తో కల్కి కలెక్షన్స్ అధికారికంగా పోస్ట్ చేయరా అనే డౌట్ కూడా వస్తుంది.