Goa Schools : గోవాలో తగ్గిన కరోనా.. ఫిబ్రవరి 21 నుంచి స్కూళ్లు రీఓపెన్..

దేశవ్యాప్తంగా కరోనావైరస్ తగ్గుముఖం పడుతోంది. గతకొద్దిరోజులుగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. కొత్తగా 103 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Goa Schools : దేశవ్యాప్తంగా కరోనావైరస్ తగ్గుముఖం పడుతోంది. గతకొద్దిరోజులుగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గోవాలో కోవిడ్-19 కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 12 తరగతి (ఇంటర్) విద్యార్థుల వరకు సోమవారం (ఫిబ్రవరి 21) నుంచి ఫిజికల్ క్లాసులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని విద్యా సంస్థలకు ఇది వర్తిస్తుందని ప్రకటనలో తెలిపింది. అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గిపోతున్న క్రమంలో ఫిబ్రవరి 21 నుంచి 1వ తరగతి నుంచి XII వరకు అన్ని విద్యాసంస్థలను తిరిగి తెరవాలని నిర్ణయించింది.

SOP మార్గదర్శకాల ప్రకారం… రాష్ట్రంలో ఒమిక్రాన్ వేవ్ (Omicron Wave) కారణంగా గత ఏడాది చివరిలో స్కూళ్లను పాక్షికంగా తెరిచిన గోవా ప్రభుత్వం.. కేసుల తీవ్రత పెరగడంతో పాఠశాలలను మూసివేసింది. మార్చి 2020లో మహమ్మారి ప్రారంభమైన సమయంలో విద్యార్థులు తరగతులకు హాజరుకు బదులుగా ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత తగ్గిపోవడంతో స్కూళ్లను తెరవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గోవా సర్కార్ స్కూళ్లను తెరిచి ఫిజికల్ క్లాసులను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది.

గోవాలో గురువారం (ఫిబ్రవరి 17)న కొత్తగా 103 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 3 మరణాలు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,44,508కి చేరుకున్నాయి. కరోనా మరణాల సంఖ్య 3,785కి పెరిగింది. రోజులో 481 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,39,496కి పెరిగింది. గోవా రాష్ట్రంలో ప్రస్తుతం 1,227 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం ఒక్కరోజే మొత్తం 1,801 కరోనా పరీక్షలను నిర్వహించింది. కోస్తా ప్రాంతంలో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 18,61,114కి చేరిందని అధికారి ఒక తెలిపారు. గోవాలో కరోనా పాజిటివ్ కేసులు 2,44,508 నమోదు కాగా.. అందులో కొత్త కేసులు 103, మరణాల సంఖ్య 3,785, రికవరీలు 2,39,496, యాక్టివ్ కేసులు 1,227 ఉండగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,61,114 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

100 శాతం వ్యాక్సినేషన్ పూర్తైన రాష్ట్రంగా గోవా :
మరోవైపు.. దేశంలోనే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిన రాష్ట్రంగా గోవా నిలిచింది. గోవాలో 18 ఏళ్లు పైబడిన జనాభా 11.66 లక్షలు ఉన్నారు. ఫిబ్రవరి 16 నాటికి అర్హులైన అందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయింది. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తవడంతో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్ ఉండదని స్పష్టం చేసింది. సాధారణ వ్యాక్సిన్ల మాదిరిగానే అన్ని హెల్త్ కేర్ సెంటర్లలో కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని గోవా ఆరోగ్య శాఖ పేర్కొంది.

వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడంతో శ్రమించిన హెల్త్ కేర్ సిబ్బందిని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రానే అభినందించారు. గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్‌ కోసం వారి కృషి, నిబద్దత అభినందనీయమన్నారు. కొంతమంది వృద్దులు.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కొందరు వ్యాక్సిన్ తీసుకోలేదన్నారు. వీరంతా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ సెంటర్లను మూసివేయడం లేదన్నారు. వారానికి ఒకరోజు మాత్రమే వ్యాక్సినేషన్ జరుగుతుందని వెల్లడించారు.

Read Also : Covid Spike: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత గోవాలో చెలరేగుతున్న కొవిడ్

ట్రెండింగ్ వార్తలు