Bihar : ఛాతిపై 21 కలశాలు పెట్టుకుని…అమ్మవారికి పూజలు

దుర్గాదేవికి పూజరి చేస్తున్న పూజ అందర్నీ ఆకట్టుకొంటోంది. ఇతనిని చూడడటానికి చాలా మంది ఆలయానికి పోటెత్తుతున్నారు. పాట్నాలో ఓ ప్రాంతంలో ఉన్న ఆలయంలో దుర్గాదేవి పూజలు నిర్వహిస్తున్నారు.

Kalash On His Chest : దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాలను అందంగా అలంకరించి..ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోంది. కరోనా నియమ నిబంధనల మధ్య అమ్మవారి దర్శనానికి అనుమతినిస్తున్నారు. ఆలయాల్లోనే కాకుండా..రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో మంటపాలను ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టింప చేస్తున్నారు. మంటపాలను విద్యుత్ దీపాలతో అలంకరించి…పూజలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలన్నీ భక్తిభావం వెల్లివిరుస్తోంది. అయితే..కొంతమంది అమ్మవారికి వినూత్నంగా పూజలు నిర్వహిస్తూ…భక్తి ప్రవత్తులను చాటుకుంటున్నారు.

Read More : Badwel By-Election : బద్వేల్ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు నేడు చివరి గడువు

ఓ పూజారి మాత్రం దుర్గాదేవికి చేస్తున్న పూజ అందర్నీ ఆకట్టుకొంటోంది. ఇతనిని చూడడటానికి చాలా మంది ఆలయానికి పోటెత్తుతున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ఓ ప్రాంతంలో ఉన్న ఆలయంలో దుర్గాదేవికి పూజలు నిర్వహిస్తున్నారు. పూజలు చేసే పూజారీ..కింద పడుకుని…నీటితో నిండిన 21 కలశాలను ఛాతిపై పెట్టుకుని పూజలు చేస్తుండడం విశేషం. తాను 9 రోజుల పాటు ఆలయంలో ఉపవాసం ఉండడంత పాటు..దీక్షలో ఉంటానని ఆయన వెల్లడిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా..తాను ఇలా చేయడం జరుగుతోందని, గత 25 ఏండ్లుగా తాను దీనిని ఆచరించడం జరుగుతోందన్నారు. ఈ పూజారి చేస్తున్న పూజ…అందరికీ తెలిసిపోయింది. దీంతో ఆయన్ను చూడటానికి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు