TTD Tickets : ఆ వార్తలు అవాస్తవం.. శ్రీవారి దర్శనం, లడ్డూ ధరల్లో మార్పు లేదు : టీటీడీ

TTD Tickets : ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటోంది. దళారుల మాటలు నమ్మి భక్తులు మోసపోవద్దు టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

TTD Tickets : శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టంచేసింది. టీటీడీ దర్శనం, లడ్డు ధరలను సవరించిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమ‌ని టీటీడీ కొట్టిపారేసింది. తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ధర రూ.300 ఉండగా, లడ్డూ ప్రసాదం రూ. 50 ధరల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. అంతేకాదు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించొద్దని టీటీడీ
భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Read Also : TTD e-Auction : ఈ నెల 24న తిరుమలలో వాచీలు, మొబైల్ ఫోన్ కానుకలపై టీటీడీ ఈ-వేలం..

టూరిజం వెబ్‌సైట్ ద్వారా భక్తులకు టిక్కెట్లు బుక్ చేయిస్తామని చెప్పి అందుకు ధర ఎక్కువ అవుతుందని, శ్రీవారి దర్శనం కోసం భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ తెలిపింది. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో శ్రీవారి దర్శనానికి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందిస్తామంటూ కొన్ని ఫోన్ నంబర్లతో సమాచారం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.

నిజానికి.. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం శాఖలకు కొన్ని టికెట్ల కేటాయింపు జరిగింది. భక్తులు సంబంధిత టూరిజం ద్వారా ఆయా దర్శన టిక్కెట్లను పొందే సౌకర్యం ఉంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటోంది. దళారుల మాటలు నమ్మి భక్తులు మోసపోవద్దు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Read Also : Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వారికి రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం

ట్రెండింగ్ వార్తలు