Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వారికి రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం

మంగళవారం స్వామివారిని 76,381 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.85కోట్లు సమకూరింది. 33,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని

Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వారికి రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం

Tirumala Tirupati Devasthanams : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత వారంరోజులుగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. వేసవి సెలవులు కావడంతోపాటు, ఏపీ, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తికావటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6గంటల వరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. దర్శన టోకెన్ లేని భక్తులకు 12గంటల దర్శన సమయం పడుతోంది.

Also Read : Balakrishna : నా కొడుకు మోక్షజ్ఞ వస్తున్నాడు.. నేను, విశ్వక్ కవలలం..

మంగళవారం స్వామివారిని 76,381 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.85కోట్లు సమకూరింది. 33,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలాఉంటే తిరుపతిలో టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లు ఉన్న భక్తులకు తక్కువ సమయంలోనే దర్శనం పూర్తవుతుండగా.. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 2గంటల సమయం పడుతుంది. తిరుమలలో రూమ్స్ పొందేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతోంది.