Vijay Deverakonda : విజయ్ ఎంత లక్కీ.. నేషనల్ క్రష్ తోనే చెప్పించుకున్నాడు అంటే..
తాజాగా విజయ్ - రష్మిక పలువురు ఫ్యాన్స్ ని కలిశారు. (Vijay Deverakonda)
Vijay Deverakonda
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవల ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నేడు హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ కూడా జరుగుతుంది. గీత గోవిందం సినిమాతో పరిచయం అయిన ఈ ఇద్దరూ ఫ్రెండ్స్ అయి డియర్ కామ్రేడ్ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. అప్పట్నుంచి సైలెంట్ గా డేటింగ్ చేసుకుంటున్న ఈ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటైంది.
తాజాగా విజయ్ – రష్మిక పలువురు ఫ్యాన్స్ ని కలిశారు. ఫ్యాన్స్ కు భోజనాలు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో అసలు ఈ లవ్ స్టోరీలో ముందు ఎవరు ప్రపోజ్ చేసారు? ఎవరు ఓకే చెప్పారు అని అడిగారు.
Also Read : Rasha Thadani : హీరోయిన్ తో హోలీ ఎంజాయ్ చేస్తున్న మహేష్ కొడుకు.. జయకృష్ణ, రషా తడాని హోలీ సెలబ్రేషన్స్..
దీనికి విజయ్ సమాధానమిస్తూ.. డియర్ కామ్రేడ్ సమయంలో బాగా క్లోజ్ అయ్యాం. నేను ఎంతకీ చెప్పకపోయేసరికి చివరకు రష్మికనే ప్రపోజ్ చేసింది. తన మనసులోని మాటల్ని చెప్పింది. అప్పట్నుంచి ప్రేమలో ఉన్నాం అని తెలిపాడు. దీంతో రష్మికనే విజయ్ కి ప్రపోజ్ చేసిందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. నేషనల్ క్రష్ చేతే ప్రపోజ్ చేయించుకున్నాడు అంటే విజయ్ ఎంత లక్కీ అని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
