Rohit Sharma Injured: రోహిత్ శర్మ గాయంపై కీలక అప్డేట్.. పంజాబ్‌తో మ్యాచ్ కష్టమేనా?
Rohit Sharma Injury Update: ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ (Rohit Sharma) కండరాల గాయానికి గురైయ్యాడు.
IPL 2026 Major update on Rohit Sharma injury ahead of MI vs PBKS match (pic credit@ipl)
- ఆర్సీబీ మ్యాచ్‌లో గాయపడిన రోహిత్ శర్మ
- స్కానింగ్‌లో ఎలాంటి చీలిక లేదు
- అయినప్పటికి గురువారం పంజాబ్‌తో మ్యాచ్ ఆడేది డౌటే!
Rohit Sharma : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై జట్టు ఆ తరువాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. గురువారం వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది.
ఈ క్రమంలో ముంబై ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంగళవారం కూడా సుదీర్ఘ నెట్ సెషన్‌ను ముంబై నిర్వహించింది. అయితే.. మంగళవారం నెట్ సెషన్లో రోహిత్ శర్మ పాల్గొనలేదు. దీంతో అతడి ఫిట్నెస్ పై ఆందోళనలు నెలకొన్నాయి. పంజాబ్‌తో మ్యాచ్‌లో అతడు ఆడతాడా? లేదా? అన్న ఆందోళన ఫ్యాన్స్‌లో నెలకొంది.
*లక్నో సూపర్ జెయింట్స్ మాస్టర్ ఫ్లాన్.. కోహ్లీని దెబ్బకొట్టేందుకేనా?
ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కండరాల గాయానికి గురైయ్యాడు. 241 పరుగుల లక్ష్య ఛేదనలో 13 బంతుల్లో 19 పరుగులు చేసిన అనంతరం రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. మళ్లీ అతడు మైదానంలోకి రాలేదు. మ్యాచ్ అనంతరం అతడి గాయానికి స్కానింగ్ నిర్వహించగా.. ఎలాంటి చీలిక లేదని తేలింది.
అయినప్పటికి కూడా అతడు పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆడతాడో లేదో అన్న అనిశ్చితి కొనసాగుతోంది. అయితే.. గాయం తీవ్రమైనది కాకపోవడంతో హిట్‌మ్యాన్ మరీ ఎక్కువ మ్యాచ్‌లకు దూరం కాకపోవచ్చునని సమాచారం. రోహిత్ శర్మ విషయంలో జట్టు మేనేజ్మెంట్ ఎలాంటి రిస్క్ చేయకపోవచ్చునని తెలుస్తోంది.
*గాయం నుంచి కోలుకోని విరాట్ కోహ్లీ! లక్నోతో మ్యాచ్ ఆడడం అనుమానమే?
ఇదిలా ఉంటే.. రోహిత్ ఎంఐ తరఫున 6,000 పరుగులు పూర్తి చేసి ఐపీఎల్లో ఆ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ముంబై ఫ్రాంచైజీ తరఫున హిట్ మ్యాన్ 231 ఇన్నింగ్స్‌లలో 29.76 సగటు 132.82 స్ట్రైక్ రేట్‌తో 6013 పరుగులు సాధించాడు, ఇందులో 40 అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి.
