Surya Grahan 2026: రేపే సూర్యగ్రహణం.. ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, సూతక కాలం ఎప్పుడు, భారత్ లో కనిపిస్తుందా? పూర్తి వివరాలు
పంచాంగ నియమాల ప్రకారం హిందూ విశ్వాసంలో గ్రహణాలను ఆధ్యాత్మికంగా సున్నితమైన కాలాలుగా పరిగణిస్తారు. సూర్యగ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమయ్యే సుతక్ కాలము సమయంలో వివాహాలు, గృహప్రవేశ వేడుకలు, మతపరమైన ఆచారాలు వంటి శుభ కార్యాలు చేయరు.
Solar Eclipse 2026 Representative Image (Image Credit To Original Source)
- సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు
- సూతక కాలము చెల్లదు
- యధావిధిగానే సాధారణ కార్యకలాపాలు చేసుకోవచ్చు
Surya Grahan 2026: 2026లో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న సంభవించనుంది. మరి గ్రహణం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, మన దేశంలో సూర్యగ్రహణం కనిపిస్తుందా? సూతక కాలం ఎప్పుడు.. ఇలాంటి వివరాలు తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. రేపటి సూర్యగ్రహణాన్ని “రింగ్ ఆఫ్ ఫైర్” అని పిలుస్తారు. చంద్రుడు సూర్యుని మధ్య భాగంలో దాదాపు 96 శాతం కవర్ చేస్తాడు. సూర్యకాంతి ప్రకాశవంతమైన వలయం కనిపిస్తుంది.
హిందూ సంప్రదాయంలో సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సమయాన్ని శుభకార్యాలకు అనుకూలంగా పరిగణించరు. ఈ సమయంలో జపం, ధ్యానం, దానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం శ్రేయస్కరంగా పండితులు చెబుతారు. ఇక సూతక సమయం విషయానికి వస్తే.. హిందూ సంప్రదాయంలో అనుసరించే పంచాంగ ఆధారిత నియమాల ప్రకారం, గ్రహణం కనిపించే ప్రాంతాలలో మాత్రమే సూతక కాలము వర్తిస్తుంది. ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు కాబట్టి మన దేశంలో సూతక కాలము చెల్లదని పండితులు చెబుతున్నారు.
సూర్యగ్రహణం సమయం
గ్రహణం ప్రారంభం- మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాలకు
గ్రహణం ముగింపు- సాయంత్రం 7 గంటల 57 నిమిషాలకు
గ్రహణం మొత్తం వ్యవధి- సుమారు 4 గంటల 32 నిమిషాలు
అయితే, ఈ సూర్యగ్రహణం మన భారత దేశంలో కనిపించదు. నాసా ప్రకారం, చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్య ప్రయాణించినప్పుడు, అది భూమి నుండి దాని అత్యంత సుదూర బిందువు దగ్గర ఉన్నప్పుడు కంకణాకార సూర్యగ్రహణం జరుగుతుంది. చంద్రుడు ఎక్కువ దూరంలో ఉన్నందున, అది సూర్యుని కంటే కొంచెం చిన్నగా కనిపిస్తుంది. దాని కాంతిని పూర్తిగా నిరోధించదు.
2026 సూర్యగ్రహణం: తేదీ, సమయం
ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 3:26 ISTకి ప్రారంభమై సాయంత్రం 7:57 ISTకి ముగుస్తుంది. ఖగోళ సంఘటన మొత్తం వ్యవధి సుమారు 4 గంటల 32 నిమిషాలు ఉంటుంది. అయితే, భారత ప్రామాణిక సమయంలో సమయం నిర్ణయించబడినప్పటికీ, భారతదేశం నుండి గ్రహణం గమనించబడదు.
భారత్ లో సుతక్ కాలము వర్తిస్తుందా?
పంచాంగ నియమాల ప్రకారం హిందూ విశ్వాసంలో గ్రహణాలను ఆధ్యాత్మికంగా సున్నితమైన కాలాలుగా పరిగణిస్తారు. సూర్యగ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమయ్యే సుతక్ కాలము సమయంలో వివాహాలు, గృహప్రవేశ వేడుకలు, మతపరమైన ఆచారాలు వంటి శుభ కార్యాలు చేయరు. గ్రహణం కనిపించే ప్రాంతాలలో వంట చేయడం, తినడం కూడా చేయరు.
ఒక నిర్దిష్ట ప్రాంతంలో గ్రహణం కనిపించగలిగితేనే ఈ ఆంక్షలు వర్తిస్తాయని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ సూర్య గ్రహణం భారత్ లో కనిపించదు కాబట్టి, ఫిబ్రవరి 17న రోజువారీ కార్యకలాపాలు, ఆలయ సందర్శనలు లేదా మతపరమైన వేడుకలపై ఎటువంటి ఆంక్షలు ఉండవని తేల్చి చెప్పారు.
గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది?
ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం ప్రధానంగా అంటార్కిటికాపై కనిపిస్తుంది. కేప్ టౌన్, డర్బన్ సమీపంలోని ప్రాంతాలతో పాటు జింబాబ్వే, టాంజానియా, దక్షిణ అర్జెంటీనా, చిలీ, నమీబియా, మారిషస్ సహా దక్షిణ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో పాక్షికంగా గ్రహణం కనిపించనుంది. భారత్, శ్రీలంక, నేపాల్, ఆసియాలోని చాలా ప్రాంతాలు, యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికాలోని పెద్ద ప్రాంతాల నుండి గ్రహణం కనిపించదు. గ్రహణాన్ని వీక్షించడానికి NASA ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది. భారత్ లో గ్రహణం కనిపించనందున పంచాంగ మార్గదర్శకాల ప్రకారం సుతక్ కాల్ (సూతక కాలం) ఉండదు. కాబట్టి సాధారణ కార్యకలాపాలు యధావిధిగానే చేసుకోవచ్చు.
