Balakrishna : నా కొడుకు మోక్షజ్ఞ వస్తున్నాడు.. నేను, విశ్వక్ కవలలం..

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ ముఖ్య అతిధిగా వచ్చారు.

Balakrishna : నా కొడుకు మోక్షజ్ఞ వస్తున్నాడు.. నేను, విశ్వక్ కవలలం..

Balakrishna Interesting Comments on Vishwak Sen and his Son Mokshagna

Updated On : May 29, 2024 / 7:16 AM IST

Balakrishna : దాస్ కా ధమ్కీ, గామి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన విశ్వక్‌ సేన్(Vishwak Sen) ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో రాబోతున్నాడు. నేహాశెట్టి (Neha Shetty), అంజలి (Anjali) ముఖ్య పాత్రల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’( Gangs Of Godavari) మే 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ ముఖ్య అతిధిగా వచ్చారు.

నిన్న సీనియర్ ఎన్టీఆర్ 101వ జయంతి కావడంతో ఈ ఈవెంట్లో బాలకృష్ణ తన తండ్రి గురించి గుర్తుచేసుకున్నారు. తన సినిమాల గురించి, విశ్వక్ తో తనకున్న అనుబంధం గురించి, తన తనయుడి సినిమా ఎంట్రీ గురించి మాట్లాడి ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ క్రమంలో బాలయ్య పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Also Read : Vishwak Sen : షూటింగ్ లో లారీ మీద నుంచి పడిపోయా.. మోకాలికి దెబ్బ.. బాలయ్య ఫోన్ చేసి..

బాలకృష్ణ మాట్లాడుతూ.. నా సోదరుడు విశ్వక్ సేన్ గురించి చెప్పాలి. నేను, విశ్వక్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా బయట చూస్తే ఎవరైనా మమ్మల్ని కవలలే అంటారు. సినీ పరిశ్రమలో నేను కొంతమందితోనే చాలా క్లోజ్ గా ఉంటాను. విశ్వక్ సినీ ప్రయాణాన్ని మొదటి నుంచి చూస్తున్నాను. నాలాగే విశ్వక్ కూడా సినిమా సినిమాకి, పాత్ర పాత్రకి కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తాడు. ఉడుకు రక్తం, నాలాగే దూకుడుతనం కూడా ఉంది విశ్వక్ లో అని అన్నారు.

అలాగే తన తనయుడు గురించి మాట్లాడుతూ.. నా తనయుడు మోక్షజ్ఞ కూడా సినీ రంగంలోకి వస్తాడు. వాడికి నన్ను చూసి ఏం నేర్చుకోవద్దు అనే చెప్తాను. ఈ తరం హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్.. లాంటి వాళ్ళని చూసి నేర్చుకోమని చెప్తాను అని తెలిపారు. దీంతో బాలయ్య బాబు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్ల నుంచి మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడు అనే చెప్తున్నారు కానీ ఎలాంటి క్లారిటీ లేదు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది కానీ ఇప్పటివరకు ఏ అధికారిక ప్రకటన లేకపోవడంతో నందమూరి అభిమానులు తమ బాలయ్య వారసుడి ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు బాలయ్య మరోసారి మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడు అని చెప్పడంతో ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.