భక్తులకు జీవితాంతం గుర్తుండిపోయేలా సేవ చేస్తా- టీటీడీ కొత్త ఈవో శ్యామలరావు

సీఎం నా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించడం అదృష్టంగా భావిస్తాను. ప్రతీ ఒక్కటి పారదర్శకంగా, పద్ధతిగా, అకౌంటబులిటీ ఉండేలా చూస్తాము.

TTD EO Shyamala Rao : తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవ చేయటం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు ఆలయ ఈవో శ్యామలరావు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. డ్యూటీని డివైన్ గా భావిస్తానని, భక్తులకు జీవితాంతం గుర్తుండిపోయేలా సేవ చేస్తానని చెప్పారాయన.

టీటీడీలో ప్రతీ ఒక్కటి పారదర్శకంగా, పద్ధతిగా ఉండేలా చూసుకుంటానని శ్యామలరావు అన్నారు. అంతకుముందు శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు జె.శ్యామలరావు. క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ తొలుత వరాహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని గరుడ ఆల్వార్ సన్నిధిలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు శ్యామలరావు.

శ్యామల రావు- టీటీడీ ఈఓ
”హిందువులకు పవిత్రమైనది శ్రీవారి ఆలయం. ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిగా తిరుమలకు వస్తుంటారు. టీటీడీకి ఈఓగా రావడం అదృష్టంగా భావిస్తాను. డ్యూటీని డివైన్ గా భావిస్తా. సీఎం నా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించడం అదృష్టంగా భావిస్తాను. భక్తులకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాము. ప్రతీ ఒక్కటి పారదర్శకంగా, పద్ధతిగా, అకౌంటబులిటీ ఉండేలా చూస్తాము”.

Also Read : నిన్న సీఎం చంద్రబాబు, నేడు మంత్రి నారాయణ.. ఐఏఎస్ శ్రీలక్ష్మికి డబుల్ షాక్..!

ట్రెండింగ్ వార్తలు