నిన్న సీఎం చంద్రబాబు, నేడు మంత్రి నారాయణ.. ఐఏఎస్ శ్రీలక్ష్మికి డబుల్ షాక్..!

జీవోలపై పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది. శ్రీలక్ష్మిని బదిలీ చేసే వరకు ఆమెకు ఫైళ్లను పంపకూడదని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నిన్న సీఎం చంద్రబాబు, నేడు మంత్రి నారాయణ.. ఐఏఎస్ శ్రీలక్ష్మికి డబుల్ షాక్..!

IAS Srilakshmi : ఏపీ పట్టణాభివృద్ది శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి నారాయణ బాధ్యతలు స్వీకరించే సమయంలో శ్రీలక్ష్మి మంత్రి నారాయణతో మొదటి సంతకం చేయాల్సిన ఫైళ్లను తీసుకొచ్చారు. ఆయనతో ఫైళ్లపై సంతకం చేయించే ప్రయత్నం చేశారు. అయితే, నారాయణ మాత్రం సంతకాలు ఇప్పుడు అవసరం లేదని, తర్వాత చూద్దాం అని చెబుతూ ఆమె తీసుకొచ్చిన ఫైళ్లపై సంతకం పెట్టలేదు.

సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రస్తుతం రాష్ట్ర అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మికి తాజా టీడీపీ ప్రభుత్వంలో వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శ్రీలక్ష్మి బొకే ఇస్తున్నప్పుడు ఆయన నిరాకరించారు. శ్రీలక్ష్మి ఇచ్చిన బొకేని చంద్రబాబు తీసుకోలేదు. మిగిలిన ఐఏఎస్ ల నుంచి బొకేలను తీసుకున్న చంద్రబాబు.. శ్రీలక్ష్మి నుంచి మాత్రం పుష్పగుచ్చం తీసుకోలేదు.

మరోవైపు ఏపీ జీవోలపై పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది. శ్రీలక్ష్మిని బదిలీ చేసే వరకు ఆమెకు ఫైళ్లను పంపకూడదని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీలక్ష్మిని పట్టణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి తప్పించి జీఏడీకి పంపుతారన్న ప్రచారం ఐఏఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Also Read : లోకేశ్ రెడ్ బుక్.. తీవ్ర భయాందోళనలో ఆ అధికారులు..!