భక్తులతో పోటెత్తిన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారి దర్శనార్ధం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.

Devotees Flocking To Temples : వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. శనివారం ఒక్కరోజు 82వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆది, సోమవారం కూడాసెలవు కావడంతో ఆదివారం తిరుమలలో వేంకటేశ్వర స్వామివారి దర్శనంకోసం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో శ్రీవారి దర్శనానికి 30గంటల సమయం పడుతుంది. అదేవిధంగా విజయవాడ దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. మరోవైపు తెలంగాణలోని యాదాద్రి, భద్రాద్రి, బాసర క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.

Also Read : Sitara – Mahesh : ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన సితార పాప.. సూపర్ హీరో అంటూ..

వరుస సెలవులతో యాదాద్రిలో లక్ష్మీనర్సింహ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి.. ఆలయం మాఢ వీధులు రద్దీగా కనిపిస్తున్నాయి. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. భద్రాద్రి ఆలయంలోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీరాముడిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. బాసర సరస్వతీదేవి ఆలయంలోనూ భక్తులు పోటెత్తారు. ఆదివారం శుభముహూర్తం ఉండటంతో అక్షరాభ్యాసాలు చేయించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చాయి. ఆంధ్రా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలోని అక్షరాభ్యాస మండపాలన్ని చిన్నారులతో నిండిపోయాయి.

Also Read : TTD : తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. టోకెన్ లేకుండా శ్రీవారి దర్శనానికి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పడుతుంది. అమ్మవారి దర్శనార్ధం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఘాట్ రోడ్డుపై రద్దీ దృష్ట్యా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. మహామండపం వైపు టూ వీలర్ వాహనాలకు మాత్రమే అనుమతి కల్పించారు. కొండపైన రద్దీ దృష్ట్యా కొండ కింద వాహనాలను పార్కింగ్ చేసుకొని.. దేవస్ధానం బస్సులలోనే అమ్మవారి దర్శనానికి రావాలని దుర్గగుడి అధికారులు సూచించారు. సాయంత్రం వరకు భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులను ఈవో కేఎస్ రామారావు అలర్ట్ చేశారు. భక్తులకు అమ్మవారి దర్శనం సజావుగా సాగే విధంగా అధికారులంతా క్యూలైన్లలో విధుల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు