Guduputani : రివ్యూ

సప్తగిరి, నేహా సోలంకి జంటగా రఘు కుంచే ప్రధాన పాత్రలో నటించిన ‘గూడుపుఠాణి’ మూవీ రివ్యూ..

Guduputani: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్ చాలామంది హీరోలుగా నటించారు కానీ సక్సెస్ అందుకుంది మాత్రం కొద్దిమందే. మంచి సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో, పంచ్ డైలాగులతో, మంచి నటనతో, మంచి కథలతో ఎంటర్‌టైన్ చేస్తున్న నటుడు సప్తగిరి. ‘సప్తగిరి ఎల్ఎల్‌బి’, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని అలరించాడు. ఇప్పుడు ‘గూడుపుఠాణి’ అంటూ మరో డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు.

Shyam Singha Roy: నాని శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ

సప్తగిరి, నేహా సోలంకి జంటగా రఘు కుంచే ప్రధాన పాత్రలో కె.యమ్. కుమార్ దర్శకత్వంలో.. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ మీద పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన చిత్రం ‘గూడుపుఠాణి’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

 

కథ..
సప్తగిరి తొలిచూపులోనే నేహా సోలంకితో ప్రేమలో పడతాడు. ఒక పురాతన అమ్మవారి దేవాలయంలో పెళ్లి చేసుకుందామని రెడీ అవుతారు. మరో వైపు దేవాలయాల్లో వరుసగా అమ్మవారి నగలు దొంగిలించబడతాయి. పోలీసులు ఆ దొంగలను పట్టుకునే పనిలో ఉంటారు. ఈ క్రమంలో హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకోబోయే గుడిలో కూడా దొంగలు పడతారు. మరి ఆ దొంగలు ఎవరు?. ప్రేమించిన అమ్మాయితో సప్తగిరి పెళ్లి జరుగుతుందా? అసలు ఆ గుడిలో ఏం జరుగుతుంది అనేది మిగతా కథ.

My Dear Bootham : ప్రభుదేవా కొత్త సినిమా ట్రైలర్ చూశారా..

నటీనటులు..
సప్తగిరి మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసాడు. రఘు కుంచె నటన హైలెట్‌గా నిలుస్తుంది. హీరోయిన్‌ నేహా తన నటనతో యూత్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. కామెడీ హీరో అల్లరి నరేష్ కి ‘నాంది’ చిత్రం ఎంతటి పేరు తెచ్చిపెటిందో సప్తగిరికి కూడా ఈ ‘గూడుపుఠాణి’ అంతటి పేరు తెచ్చిపెడుతుంది. మంచి థ్రిల్లింగ్ ఎలెమెంట్స్‌తో ఆసక్తి కలిగించే చిత్రమిది. సప్తగిరి తన కామెడీతో అలరిస్తూనే కొన్ని కీలక సన్నివేశాల్లో భయపెట్టాడు కూడా.

Atrangi Re : టాక్ సూపర్‌హిట్.. కానీ అదొక్కటే మైనస్..

టెక్నీషియన్స్..
అద్భుతమైన కథ కథనంతో మంచి ట్విస్ట్‌లతో చక్కటి వినోదభరితమైన చిత్రాన్ని అందించాడు దర్శకుడు కుమార్. సప్తగిరిని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాడు డైరెక్టర్. చిత్రంలో కామెడీతో పాటు మంచి కథ, కథనం, అద్భుతమైన డైలాగులు, అందమైన లొకేషన్స్‌తో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని ప్రేక్షకులకి అందించారు. మున్నా (ఫణి ప్రదీప్) మాటలు, పవన్ చెన్నా సినిమాటోగ్రఫీ, ప్రతాప్ విద్య బ్యాగ్రౌండ్ స్కోర్, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి.

 

ఓవరాల్‌గా..
‘గూడుపుఠాణి’ చక్కటి వినోద భరితమైన చిత్రం. మంచి ట్విస్ట్‌లతో ప్రేక్షకులని ఆకట్టుకుటుంది. ఫామిలీతో చూడదగ్గ చిత్రం. తప్పకుండా చూడొచ్చు.

ట్రెండింగ్ వార్తలు