Babar Azam becomes most successful T20I captain with win against Ireland
Pakistan captain Babar Azam : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ను పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందడంతో బాబర్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా రికార్డును బద్దలు కొట్టాడు. మసాబా నాయకత్వంలో ఉగాండా 44 టీ20 మ్యాచుల్లో గెలవగా.. బాబర్ నాయకత్వంలో పాకిస్తాన్ 45 మ్యాచుల్లో విజయం సాధించింది.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్లు..
బాబర్ ఆజం (పాకిస్తాన్) – 45
బ్రియాన్ మసాబా(ఉగాండా) – 44
ఇయాన్ మోర్గాన్(ఇంగ్లాండ్) – 42
అస్గర్ ఆఫ్ఘన్ (అఫ్గానిస్తాన్) – 42
ఎంఎస్ ధోని(భారత్) – 41
Sehwag : గెలిచినా, ఓడినా రూ.400 కోట్ల లాభం.. చాలదా? ఓనర్లు అయితే జట్టులో వేలు పెట్టాలా? : సెహ్వాగ్ వ్యాఖ్యలు వైరల్
రోహిత్ శర్మ(భారత్) – 41
ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) – 40
అహ్మద్ ఫైజ్(మలేషియా) – 39
గెర్హార్డ్ ఎరాస్మన్(నమీబియా) -38
కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) – 37
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. లోర్కాన్ టక్కర్ (34 బంతుల్లో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ లక్ష్యాన్ని పాకిస్తాన్ 16.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహ్మద్ రిజ్వాన్ (46 బంతుల్లో 75 నాటౌట్), ఫఖార్ జమాన్ (40 బంతుల్లో 78) అర్ధశతకాలు బాదగా ఆఖర్లో ఆజామ్ ఖాన్ (10 బంతుల్లో 30 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో డకౌట్ కావడం గమనార్హం..
RCB vs DC : హమ్మయ్యా గెలిచాం.. దండాలు సామీ..: అనుష్క శర్మ రియాక్షన్ వైరల్