Rajamouli : దుబాయ్ నుంచి వచ్చి మరీ ఓటు వేసిన రాజమౌళి.. మహేష్ సినిమా వర్క్‌తో బిజీగా ఉన్నా..

రాజమౌళి, భార్య రమా రాజమౌళి, తనయుడు కార్తికేయ దుబాయ్ నుంచి వచ్చి మరీ ఓట్ వేశారు

Rajamouli : రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) సినిమా వర్క్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తవగా ప్రస్తుతం రాజమౌళి – మహేష్ బాబు దుబాయ్ లో ఈ సినిమా కోసం వర్క్ షాప్ చేస్తున్నారు. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో సెలబ్రిటీలు అంతా వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

ఈ క్రమంలో రాజమౌళి, భార్య రమా రాజమౌళి, తనయుడు కార్తికేయ దుబాయ్ నుంచి వచ్చి మరీ ఓట్ వేశారు. ఓట్ వేసినట్టు సిరా పూసిన వేళ్ళను చూపిస్తూ రాజమౌళి, రమా రాజమౌళి దిగిన ఫోటోని కార్తికేయ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఓటు వేయడానికి దుబాయ్ నుంచి వచ్చాము. డైరెక్ట్ ఎయిర్ పోర్ట్ నుంచి పోలింగ్ బూత్ కే వచ్చి ఓటు వేసాము. మీరంతా కూడా ఓట్ వేయండి అని పోస్ట్ చేశారు.

Also Read : Allu Arjun : నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్.. పవన్ గురించి ఏమన్నారంటే?

దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. రాజమౌళి దుబాయ్ నుంచి వచ్చి మరీ ఓట్ వేయడంతో అంతా అభినందిస్తున్నారు. మరి మహేష్ కూడా దుబాయ్ నుంచి వచ్చాడా, మహేష్ ఓటు వేయడానికి వస్తాడా చూడాలి.