Nayanthara : వంద కోట్లిచ్చినా ఆ హీరోతో సినిమా చేయనన్న నయనతార.. ఆ హీరో ఎవరో తెలుసా?
ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? (Nayanthara)
Nayanthara
Nayanthara : ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్ళు అవుతున్నా, పెళ్లయినా ఇంకా స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తుంది నయనతార. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఇటీవలే చిరంజీవి సరసన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటించి భారీ హిట్ కొట్టింది. నయనతార ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.(Nayanthara)
కానీ నయనతార ఓ హీరో పక్కన చేయడానికి ఆఫర్ వస్తే వంద కోట్లిచ్చినా అతని పక్కన సినిమా చేయను అని చెప్పిందని గతంలో రూమర్స్ వచ్చాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?
Also Read : Anchor Sravanthi : డైమండ్ రింగ్ లాగేసారు.. చున్నీ చిరిగిపోయింది.. పాపం స్రవంతి..
నయనతార నో చెప్పింది తమిళ నటుడు లెజెండ్ శరవణన్ కి. శరవణన్ తమిళనాడులో ఓ పెద్ద వ్యాపారవేత్త. శరవణన్ స్టోర్స్ తో పాటు, బట్టల షాప్స్ కూడా చాలా ఉన్నాయి. కింద స్థాయి నుంచి పైకి ఎదిగాడు. ఎన్నో సహాయ కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే శరవణన్ 50 ఏళ్ళ వయసులో హీరోగా లెజెండ్ అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమాలో మొదట నయనతారనే హీరోయిన్ గా అడిగారట. రెమ్యునరేషన్ కూడా భారీగా ఇస్తామన్నారట. కానీ నయనతార మాత్రం.. వంద కోట్లు ఇచ్చినా ఆయనతో కలిసి నటించను అని చెప్పిందట. అప్పట్లో ఈ కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే దీనిపై నయనతార మాత్రం స్పందించలేదు.
Also Read : Raviteja : చిరంజీవి సినిమా కోసం రవితేజ సినిమా ఆపేసారా? ఇంకెప్పుడు వచ్చేది..
నయనతార నో చెప్పడంతో ఊర్వశి రౌతేలాని హీరోయిన్ గా తీసుకొని 2022 లో లెజెండ్ సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమా తమిళ్ లో యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు శరవణన్ లీడర్ అనే సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారో చూడాలి.

