IND vs AUS Test Series 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరాలంటే.. శ్రీలంక జట్టు ఓడాల్సిందేనా..

మూడో టెస్టులో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా తరువాతి స్థానంలో ఇండియా, శ్రీలంక జట్లు ఉన్నాయి. అయితే, ఈ రెండు జట్లలో ఏ జట్టు ఫైనల్‌కు వెళ్లి ఆసీస్‌తో తలపడుతుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది.

IND vs AUS Test Series 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఇండియాలో జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇండియా 2-1 ఆధిక్యంలో ఉంది. మరో మ్యాచ్ మిగిలిఉంది. మార్చి 9 నుంచి ఫోర్త్ టెస్ట్ ప్రారంభమవుతుంది. అయితే, ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తుండగా.. మ్యాచ్‌ను డ్రా చేయడం ద్వారా సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తుంది. మూడో టెస్టులో విజయం సాధించి ప్రపంచ టెస్టు చాంఫియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు చేరాలనుకున్న భారత్ జట్టుకు ఆస్ట్రేలియా అద్భుత విజయంతో షాకిచ్చింది. దీంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఆ రెండు అవకాశాలు విఫలమైతే డబ్ల్యూటీసీ ఫైనల్ పై టీమిండియా ఆశలు ఒదులుకున్నట్లే.

IndiaVsAustralia: మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం.. చిత్తుగా ఓడిన టీమిండియా

మూడో టెస్టులో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా తరువాతి స్థానంలో ఇండియా, శ్రీలంక జట్లు ఉన్నాయి. అయితే, ఈ రెండు జట్లలో ఏ జట్టు ఫైనల్‌కు వెళ్లి ఆసీస్‌తో తలపడుతుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఇండియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా 68.52 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, భారత్ 60.29 శాతం, శ్రీలంక జట్టు 53.33శాతంతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. అహ్మదాబాద్‌లో ఈ నెల 9నుంచి ప్రారంభమయ్యే ఇండియా, ఆస్ట్రేలియాలో నాల్గో టెస్టులో భారత్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణలు లేకుండానే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరుతుంది. డ్రా అయిన, ఓడిపోయినా త్వరలో న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య టెస్టు సిరీస్‌లో శ్రీలంక జట్టు ప్రదర్శనపై భారత్ ఆధారపడాల్సి ఉంటుంది.

ICC World Test Championship

 

న్యూజిలాండ్ తో శ్రీలంక జట్టు రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ లో శ్రీలంక జట్టు 2-0తో నెగ్గితే ఆ జట్టు పాయిట్ల పట్టికలో రెండో ప్లేస్ కు చేరి ఆసీస్ తో డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో తలపడుతుంది. ఒకవేళ శ్రీలంక జట్టు కివీస్ పై ఒక్క టెస్టు ఓడిపోయినా, రెండు టెస్టు మ్యాచ్ లు డ్రా అయినా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ అవకాశాలను కోల్పోతుంది. దీంతో భారత్ కు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది.

ట్రెండింగ్ వార్తలు