Sanju Samson Post In Malayalam After T20 World Cup Selection Is Viral
Sanju Samson Post In Malayalam : వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో వికెట్ కీపర్ గా సంజు శాంసన్‌కు చోటు దక్కింది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న శాంసన్.. సారథిగానే కాకుండా తన నిలకడైన బ్యాటింగ్‌తో సెలక్టర్లను ఆకట్టుకోవడంతో పొట్టి ప్రపంచకప్‌లో స్థానం లభించింది. కాగా.. తాను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక అయ్యాను అని తెలిసిన తరువాత సంజు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
టీమ్ఇండియా జెర్సీలో ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ “వియర్పు తునియిట్ట కుప్పాయమ్” అని తన మాతృభాష మలయాళంలో దానికి క్యాప్షన్ ఇచ్చాడు. శ్రమ, చెమటతో కుట్టిన చొక్కా అని దీనికి అర్థం.
వాస్తవానికి సంజూ శాంసన్ 2015లో జింబాబ్వే పై అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఇన్నేళ్లలో అతడు కేవలం 25 టీ20ల్లో మాత్రమే టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 18.70 సగటు 133.09 స్రైక్‌రేటుతో 374 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్థశతకం ఉంది. అత్యుత్తమ స్కోరు 77.
ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన చాలా బాగుంది. ఐపీఎల్‌లో 161 మ్యాచ్‌లు ఆడాడు. 139.04 స్ట్రైక్ రేట్‌తో 30.96 సగటుతో 4,273 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 119 పరుగులు. ఇక ఈ ఐపీఎల్ సీజన్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు. తొమ్మిది మ్యాచుల్లో 77 సగటు, 161 స్ట్రైక్‌రేటుతో 385 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థశతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 82 నాటౌట్.
ఐపీఎల్‌లో డొమెస్టిక్ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ శాంసన్‌కు ఎక్కువ అవకాశాలు రాకపోవడం పై అతడి అభిమానులు ఎప్పుడూ అసంతృప్తితోనే ఉన్నారు. జట్టులో తనకు చోటు దక్కకపోయినప్పటికీ ఎప్పుడు కూడా శాంసన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన హార్డ్ వర్క్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. మొత్తానికి ఇప్పుడు టీ20ప్రపంచకప్‌లో చోటు దక్కడం పై సంజూ పై విధంగా స్పందించాడు.
KKR : ఢిల్లీని చిత్తు చేసిన ఆనందంలో కేకేఆర్.. భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. పేసర్ పై మ్యాచ్ నిషేదం
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.