Hardik Pandya : అయ్యో పాపం.. హార్దిక్ పాండ్య‌కు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. మ‌రోసారి ఇలా చేస్తే మ్యాచ్ నిషేదం..

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్‌, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య‌కు గ‌త కొద్ది రోజులుగా ఏదీ క‌లిసి రావ‌డం లేదు.

Hardik Pandya Fined : టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్‌, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య‌కు గ‌త కొద్ది రోజులుగా ఏదీ క‌లిసి రావ‌డం లేదు. అత‌డి సార‌థ్యంలో ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై జ‌ట్టు వరుస ప‌రాజ‌యాల‌ను చ‌విచూస్తోంది. మంగ‌ళ‌వారం ల‌క్నోలోని ఏకానా స్టేడియంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ముంబై ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి.

అస‌లే వ‌రుస ఓట‌ముల బాధ‌లో ఉన్న ముంబై జ‌ట్టుకు బీసీసీఐ షాకిచ్చింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యకు రూ.24 లక్ష‌ల ఫైన్ వేసింది. అంతేకాదండోయ్ ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా ముంబై జ‌ట్టులోని మిగిలిన ఆట‌గాళ్ల మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ.6ల‌క్ష‌లు రెండింటిలో ఏదీ త‌క్కువ అయితే దాన్ని జ‌రిమానా విధించింది. ల‌క్నో మ్యాచ్‌లో ముంబై నిర్ణీత స‌మ‌యంలో ఓవ‌ర్ల‌ను పూర్తి చేయ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం.

Sanju Samson : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చోటు.. మ‌ల‌యాళంలో సంజుశాంస‌న్ పోస్ట్‌.. మ‌న‌సుల‌ను క‌దిలిస్తోంది

ఈ సీజ‌న్‌లో ముంబై జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేటుకు పాల్ప‌డ‌డం ఇది రెండో సారి. అందుక‌నే కెప్టెన్ మ్యాచ్ ఫీజులో రూ.24 కోత ప‌డింది. ఈ సీజ‌న్‌లో ఇలాంటి త‌ప్పిదం మ‌రోసారి రిపీట్ అయితే ఓ మ్యాచ్ నిషేదాన్ని హార్దిక్ పాండ్య ఎదుర్కొనాల్సి ఉంటుంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ముంబై మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో రోహిత్‌ శర్మ (4), సూర్యకుమార్‌ (10), తిలక్‌ వర్మ (7), హార్దిక్‌ పాండ్యా (0) లు విఫ‌లం అయ్యారు. నేహల్‌ వధేరా (46), టిమ్‌ డేవిడ్‌ (35 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (32) లు రాణించ‌డంతో ముంబై ఓ మోస్తరు స్కోరు చేసింది. లక్నో బౌలర్లలో మొహిసిన్‌ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. మార్క‌స్‌ స్టోయినిస్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, మయాంక్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్ త‌లా ఓ వికెట్ సాధించారు.

Jasprit Bumrah : ‘ఇగో.. ఇది నీకే..’ పిల్లాడికి ప‌ర్పుల్ క్యాప్ ఇచ్చిన బుమ్రా..

అనంత‌రం.. 19.2 ఓవ‌ర్ల‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఆరు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది. ల‌క్నో బ్యాట‌ర్లో మార్క‌స్ స్టోయినిస్‌ (62) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ముంబై బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. నువాన్‌ తుషార, గెరాల్డ్‌ కొయెట్జీ, మ‌హ్మ‌ద్ నబీ త‌లా ఓ వికెట్ సాధించారు.

ట్రెండింగ్ వార్తలు