IPL 2024 : ఐపీఎల్-2024 సీజ‌న్‌లో తొలిసారి అవుట్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఎలా అంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో తొలి తొమ్మిది మ్యాచ్ లలో మహేంద్ర సింగ్ ధోనీ నాటౌట్ గా నిలిచాడు. అనేక మ్యాచ్ లలో చివరిలో బ్యాటింగ్ కు వచ్చి బౌండరీల మోత మోగించాడు.

IPL 2024 PBKS vs CSK : ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఇంకా 13 బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై గెలిచింది. దాంతో ఫ్లేఆఫ్స్ అవకాశాలను పంజాబ్ సజీవంగా నిలుపుకుంది. సీఎస్కే జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసింది.. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో 163 పరుగులు చేసి విజయం సాధించింది.

Also Read : Mayank yadav : మళ్లీ గాయపడిన మయాంక్ యాదవ్.. లక్నో యాజమాన్యంపై బ్రెట్ లీ తీవ్ర వ్యాఖ్యలు

2024 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటి వరకు అవుట్ కాలేదు. తాజాగా.. బుధవారం రాత్రి చపాక్ స్టేడియంలో పంజాబ్ వర్సెస్ చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అవుట్ అయ్యాడు. రితురాజ్ గైక్వాడ్ ఔటైన్ తరువాత 18వ ఓవర్లలో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ.. 11 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టాడు. చివరి బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో ధోనీ రనౌట్ అయ్యాడు.

Also Read : IPL 2024 : చెపాక్‌లో చితక్కొట్టిన పంజాబ్.. చెన్నైపై 7 వికెట్ల తేడాతో విజయం.. ఫ్లేఆఫ్స్ అవకాశాలు సజీవం!

ఈ సీజన్ లో తొలి తొమ్మిది మ్యాచ్ లలో మహేంద్ర సింగ్ ధోనీ నాటౌట్ గా నిలిచాడు. అనేక మ్యాచ్ లలో చివరిలో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ.. బౌండరీల మోత మోగించాడు. ఈ సీజన్ లో 10 మ్యాచ్ లు ఆడిన ధోనీ 110 పరుగులు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ 10 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ 229. ధోనీ 110 సగటుతో పరుగులు సాధించాడు. ఈ సీజన్ లో ధో్నీదే అత్యధిక సగటు.

 

ట్రెండింగ్ వార్తలు