Mayank yadav : మళ్లీ గాయపడిన మయాంక్ యాదవ్.. లక్నో యాజమాన్యంపై బ్రెట్ లీ తీవ్ర వ్యాఖ్యలు
21ఏళ్ల మయాంక్ యాదవ్ ఏప్రిల్ 7న గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కడుపులో నొప్పి కారణంగా మైదానంను వీడాడు. ఆ తరువాత దాదాపు మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు.

Brett Lee and Mayank Yadav
Brett Lee on Mayank Yadav : యువ పేస్ సంచలనం, లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ మళ్లీ గాయపడ్డాడు. ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ఏప్రిల్ 30న లక్నో సూపర్ జెయింట్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మయాంక్ యాదవ్ గాయపడి నాలుగు ఓవర్లు కూడా పూర్తి చేయలేక పోయాడు. దీంతో అతను ఈ సీజన్ లో రెండోసారి గాయపడి మైదానంను వీడాడు. మయాంక్ గాయపడడం పై ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ లక్నో యాజమాన్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
Also Read : IPL 2024 : చెపాక్‌లో చితక్కొట్టిన పంజాబ్.. చెన్నైపై 7 వికెట్ల తేడాతో విజయం.. ఫ్లేఆఫ్స్ అవకాశాలు సజీవం!
మయాంక్ యాదవ్ గాయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం సరిగా అంచనా వేయలేక పోయిందని బ్రెట్ లీ అభిప్రాయ పడ్డాడు. పొత్తి కడుపు కండరానికి గాయమవడంతో గతంలో మైదానంను వీడిన మయాంక్ ను.. పూర్తిగా కోలుకోకుండానే ఐపీఎల్ మ్యాచ్ కు తీసుకురావడాన్ని బ్రెట్ లీ తప్పుబట్టాడు. మయాంక్ యాదవ్ మరోసారి గాయపడటానికి కారణం లక్నో మేనేజ్ మెంట్, వైద్య సిబ్బందిదే కారణమని బ్రెట్ లీ అన్నాడు. మయాంక్ కు అయిన గాయం నయం కావడానికి కనీసం నాలుగు నుండి ఆరు వారాలు పడుతుంది. ఎంత సీరియస్ గా ఉంటుందో తెలియదు. కానీ, గంటకు 155 కిలో మీటర్లు వేగంతో బౌలింగ్ చేస్తూ, శరీరంపై భారం మోపుతున్న వ్యక్తికి కోలుకోవటానికి సమయం ఇవ్వాల్సిందని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.
21ఏళ్ల మయాంక్ యాదవ్ ఏప్రిల్ 7న గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పొత్తి కడుపు కండరానికి గాయం కారణంగా మైదానంను వీడాడు. ఆ తరువాత దాదాపు మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. తాజాగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆడిన మయాంక్.. మరోసారి గాయం కారణంగా నాలుగు ఓవర్లు పూర్తిచేయకుండానే మైదానంను వీడాడు. ఈ ఐపీఎల్ లో గంటకు 155 కిలో మీటర్లు బంతులు సంధిస్తూ మయాంక్ అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో ఉమ్రాన్ మాలిక్, విద్వత్ కావేరప్ప, వైశక్ విజయ్ కుమార్, యశ్ దయాల్, ఆకాశ్ దీప్ లతో పాటు మాయాంక్ కు కూడా పేస్ బౌలింగ్ కాంట్రాక్టు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. మయాంక్ కు కాంట్రాక్టు దక్కితే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఆధ్వర్యంలో అతనికి వైద్య సహకారం లభిస్తుంది.
Mayank Yadav set to receive a bowling contract from the BCCI. (TOI). pic.twitter.com/otCylsQFET
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2024