IPL 2024 : చెపాక్‌లో చితక్కొట్టిన పంజాబ్.. చెన్నైపై 7 వికెట్ల తేడాతో విజయం.. ఫ్లేఆఫ్స్ అవకాశాలు సజీవం!

IPL 2024 PBKS vs CSK : చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం సాధించింది. ఫ్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది.

IPL 2024 : చెపాక్‌లో చితక్కొట్టిన పంజాబ్.. చెన్నైపై 7 వికెట్ల తేడాతో విజయం.. ఫ్లేఆఫ్స్ అవకాశాలు సజీవం!

Punjab Kings beat Chennai Super Kings by 7 wickets (Image Credit : IPL/Twitter/ Google)

IPL 2024 – PBKS vs CSK : ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఇంకా 13 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. దాంతో ఫ్లేఆఫ్స్ అవకాశాలను పంజాబ్ సజీవంగా నిలుపుకుంది.

162 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ ఆటగాళ్లలో జానీ బెయిర్ స్టో (46; 30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), రిలీ రోసోవ్ (43; 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్) అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. చెన్నై పతనాన్ని శాసించిన పంజాబ్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ (2/17)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

కెప్టెన్ సామ్ కరన్ (26 నాటౌట్), ప్రభసిమ్రాన్ సింగ్ (13) పరుగులకే విఫలమయ్యారు. శశాంక్ సింగ్ (25; 26 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)తో రాణించారు. ఫలితంగా 17.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులతో గెలిచింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, శివం ధూబే తలో వికెట్ తీసుకున్నారు.

టాప్ స్కోరరుగా రుతురాజ్ గైక్వాడ్ :
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు పంజాబ్ కింగ్స్‌కు 163 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ (62) హాఫ్ సెంచరీతో టాప్ స్కోరరుగా నిలిచాడు.

మిగతా ఆటగాళ్లలో ఓపెనర్ అజింక్యా రహానె (29) చేతులేత్తేయగా, సమీర్ రిజ్వి (21), మొయిన్ అలీ (15), ఎంఎస్ ధోనీ (14), రవీంద్ర జడేజా (2), మిచెల్ ((1) పరుగుకే పరిమితయ్యారు. ఈ మ్యాచ్‌లో శివం ధూబే కనీసం ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్ ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు తీసుకోగా, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు.

టాప్ 4లో చెన్నై :
పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 5 ఓడి 10 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 6 ఓడి 8 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది.

Read Also : CSK vs PBKS : ‘నేను ఓడిపోతాన‌ని వాళ్ల‌కు తెలుసు.. ముందే వాళ్లు సిద్ధ‌మ‌య్యారు..’ పంజాబ్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ వ్యాఖ్య‌లు