CSK vs PBKS : ‘నేను ఓడిపోతానని వాళ్లకు తెలుసు.. ముందే వాళ్లు సిద్ధమయ్యారు..’ పంజాబ్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ వ్యాఖ్యలు
ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ఆడుతోంది.

pic credit @ BCCI
ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ఆడుతోంది. మ్యాచుల గెలుపోటముల విషయాలను కాస్త పక్కన బెడితే.. ఓ విషయంలో మాత్రం రుతురాజ్‌కు అస్సలు కలిసిరావడం లేదు. అదే టాస్. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అతడు ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచాడు. మిగిలిన అన్ని సందర్భాల్లో అతడు టాస్ ఓడిపోయాడు. బుధవారం పంజాబ్ కింగ్స్ జట్టుతో మ్యాచ్‌లోనూ 27 ఏళ్ల ఈ చెన్నై కెప్టెన్ టాస్ ఓడిపోయింది.
దీంతో ఈ మ్యాచ్‌తో కలిపి మొత్తం 10 మ్యాచుల్లో అతడు 9 సార్లు టాస్ ఓడిపోయాడు. ఒక్క కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే అతడు టాస్ గెలిచాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన అనంతరం రుతురాజ్ గైక్వాడ్ సరదాగా కామెంట్లు చేశాడు. తన టాస్ రికార్డును చూసి టీమ్‌లోని చాలా మంది ఆటగాళ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పాడు. తాను టాస్ ఓడిపోతాననే విషయం వారికి ముందే తెలిసిపోయిందని రుతురాజ్ నవ్వుతూ చెప్పాడు. ఒకవేళ తాను టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకునేవాడినని అన్నాడు.
Rohit Sharma : ఏంటిది రోహిత్ భయ్యా.. నీకు మిశ్రానే దొరికాడా? కాస్త చెప్పేది వినొచ్చుగా..?
పంజాబ్‍తో మ్యాచ్‍కు సీఎస్‌కే స్టార్ పేసర్ మతీష పతిరణ దూరమయ్యాడు. అనారోగ్యంగా ఉండడంతో అతడు ఆడడం లేదన్నాడు. తుషార్ దేశ్‍పాండే కూడా ఆడడం లేదని, అతడి ఆరోగ్యం సరిగా లేదని చెప్పాడు. శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లెసన్ లు తుది జట్టులోకి వచ్చారన్నాడు. కాగా.. ఇంగ్లాండ్ పేసర్ గ్లెసన్ ఈ మ్యాచ్‍తోనే ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు : అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రిచర్డ్ గ్లెసన్, ముస్తాఫిజుర్ రహమాన్
పంజాబ్ కింగ్స్ తుదిజట్టు : జానీ బెయిర్ స్టో, సామ్ కరన్ (కెప్టెన్), రాలీ రూసో, శశాంక్ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అషుతోశ్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్
? Toss ?@PunjabKingsIPL win the toss and elect to bowl against @ChennaiIPL
Follow the Match ▶️ https://t.co/EOUzgkM7XA#TATAIPL | #CSKvPBKS pic.twitter.com/1Y83T5v7Of
— IndianPremierLeague (@IPL) May 1, 2024