Rohit Sharma : ఏంటిది రోహిత్ భ‌య్యా.. నీకు మిశ్రానే దొరికాడా? కాస్త చెప్పేది వినొచ్చుగా..?

టీమ్ఇండియా కెప్టెన్‌, ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ మైదానంలో చాలా సీరియ‌స్‌గా ఉండ‌టాన్ని చూస్తూనే ఉంటాం.

Rohit Sharma : ఏంటిది రోహిత్ భ‌య్యా.. నీకు మిశ్రానే దొరికాడా? కాస్త చెప్పేది వినొచ్చుగా..?

Screengrab from video posted on x by@ LSG

టీమ్ఇండియా కెప్టెన్‌, ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ మైదానంలో చాలా సీరియ‌స్‌గా ఉండ‌టాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. ఒక్క సారి మ్యాచ్ అయిపోయాక అంద‌రితో హిట్‌మ్యాన్ ఎంతో స‌ర‌ద‌గా ఉంటాడు. ఈ విష‌యాన్ని అత‌డి స‌హ‌చ‌రులే ప‌లు మార్లు వెల్ల‌డించారు కూడా. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పోస్ట్ చేసిన వీడియో చూస్తే ఈ విష‌యం మీరే అర్థ‌మ‌మైపోతుంది.

మంగ‌ళ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య‌ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ల‌క్నో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా.. ఈ ఐపీఎల్‌లో ముంబై త‌రుపున రోహిత్ ఆడ‌గా ల‌క్నో త‌రుపున అమిత్ మిశ్రా ఆడారు. ఇక ల‌క్నో వ‌ర్సెస్ ముంబై మ్యాచ్ అనంత‌రం రోహిత్, అమిత్ మిశ్రాల మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ వైర‌ల్‌గా మారింది.

Uppal Stadium : ఉప్పల్ స్టేడియంలో సిబ్బంది మెరుపు ధర్నా.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ్యాచ్ జరిగేనా?

నీ ఏజ్ 40 ఏళ్లేనా? నేను అస్స‌లు న‌మ్మ‌ను. అంటే నువ్వు నా కంటే మూడేళ్లే పెద్ద వాడివా అని రోహిత్ శ‌ర్మ అన‌గా అవును నాకు ఇప్పుడు 41 ఏళ్లే.. నిజంగా.. న‌న్ను చూడు అని మిశ్రా అన్నాడు. ఇందుకు రోహిత్ బ‌దులు ఇస్తూ.. నువ్వు టీమ్ఇండియా త‌రుపున అరంగ్రేటం చేసిన స‌మ‌యంలో మేం ఇంకా న్యాపీలు వేసుకుని ఉండిఉంటాం అని చ‌మ‌త్క‌రించాడు. అందులో నా త‌ప్పేం లేదుగా అంటూ మిశ్రా అన‌గా అక్క‌డ న‌వ్వులు విరిసాయి.

20 ఏళ్ల వ‌య‌సులో నువ్వు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశావా? అని మ‌ళ్లీ రోహిత్ ప్ర‌శ్నించ‌గా అవును అప్పుడు నాకు 20-21 మ‌ధ్య ఏజ్ ఉంటుంది అని మిశ్రా స‌మాధానం ఇచ్చాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Hardik Pandya : అయ్యో పాపం.. హార్దిక్ పాండ్య‌కు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. మ‌రోసారి ఇలా చేస్తే మ్యాచ్ నిషేదం..

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ల‌క్నో పై ఓడిపోవ‌డంతో ముంబై ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై 10 మ్యాచులు ఆడ‌గా కేవ‌లం మూడు మ్యాచుల్లోనే గెలిచింది. ఆరు పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది. అటు ల‌క్నో ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. 10 మ్యాచుల్లో ఆరు గెలిచింది. 12 పాయింట్ల‌తో ప్లే ఆఫ్స్ చేరువైంది.