Jasprit Bumrah : ‘ఇగో.. ఇది నీకే..’ పిల్లాడికి పర్పుల్ క్యాప్ ఇచ్చిన బుమ్రా..
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 1, 2024 / 04:26 PM IST
screengrab from video posted on x by@Mumbai Indians
Jasprit Bumrah – Purple Cap : టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో తన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడిన అతడు 6.40 ఎకానమీతో 14 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అతడి వద్దే పర్పుల్ క్యాప్ ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ అనంతరం బుమ్రా చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మంగళవారం లక్నోలోని ఏకానా స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై మొదట బ్యాటింగ్ చేసింది. నేహాల్ వధేరా (46), టిమ్ డేవిడ్ (35నాటౌట్) లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని లక్నో 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ (62) హాఫ్ సెంచరీతో రాణించాడు.
Sanju Samson : టీ20 ప్రపంచకప్‌లో చోటు.. మలయాళంలో సంజుశాంసన్ పోస్ట్.. మనసులను కదిలిస్తోంది
ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా వికెట్లు ఏమీ తీయనప్పటికి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కి వెలుతున్నప్పుడు బుమ్రా తన పర్పుల్ క్యాప్‌ని స్టాండ్‌లో ఉన్న ఓ పిల్లాడికి బహుమతిగా ఇచ్చాడు.
అంతేకాదు ఆటోగ్రాఫ్ సైతం ఇచ్చాడు. దీంతో ఆ పిల్లాడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. మనసున్న మారాజు బుమ్రా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
KKR : ఢిల్లీని చిత్తు చేసిన ఆనందంలో కేకేఆర్.. భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. పేసర్ పై మ్యాచ్ నిషేదం
