My Home Group : తెల్లాపూర్‌లో మైహోమ్ సంస్థ ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్లు ప్రారంభం

పారిశ్రామిక నిర్మాణ రంగంలో పనిచేస్తున్న శ్రామికులతో పాటు వారి పిల్లల భవిష్యత్తు కోసం మా సంస్థ పూర్తి స్థాయిలో పని చేస్తుంది.

My Home Group : నిర్మాణ, పారిశ్రామిక రంగాల్లో పని చేస్తున్న శ్రామికులతో పాటు వారి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు మైహోమ్ సంస్థ కృషి చేస్తుందని మైహోమ్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన అవేక్ష డే కేర్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా కార్మికుల పిల్లల కోసం మరిన్ని డే కేర్ సెంటర్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. సామాజిక బాధ్యతకు మైహోమ్ సంస్థ కట్టుబడి ఉందన్నారు. డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి మైహోమ్ కన్ స్ట్రక్షన్స్ డైరెక్టర్ గిరిధర్ రావు, మై హోమ్ కన్ స్ట్రక్షన్స్ సీఎఫ్ వో శ్రీనివాసరావు, మాస్ మ్యూచువల్ ఇండియా హెడ్ తంగిరాల రవి, కిరణ్ కొవే సంస్థ ప్రతినిధులు, కార్మికులు వారి పిల్లలు పాల్గొన్నారు.

”పారిశ్రామిక నిర్మాణ రంగంలో పనిచేస్తున్న శ్రామికులతో పాటు వారి పిల్లల భవిష్యత్తు కోసం మా సంస్థ పూర్తి స్థాయిలో పని చేస్తుంది. సామాజిక బాధ్యత పట్ల మైహోం సంస్థ కట్టుబడి ఉంది” అని మైహోమ్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు తెలిపారు. ”భవిష్యత్తులో అవేక్ష డే కేర్ స్కూళ్ల నిర్వాహణ కోసం మేరు ఇంటర్నేషనల్ స్కూల్ పని చేస్తుంది” అని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్, డైరెక్టర్ జూపల్లి మేఘన రావు వెల్లడించారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఎంతోమంది కార్మికులు తెలంగాణకు వస్తున్నారని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ జూపల్లి మేఘన రావు అన్నారు. ఆ కార్మికుల పిల్లల కోసం నిర్వహిస్తున్న ఈ డే కేర్ సెంటర్ లో ప్రైమరీ విద్యతో పాటు పౌష్టికాహారం సైతం అందిస్తున్నట్లుగా జూపల్లి మేఘన రావు వెల్లడించారు.

”క్యాంప్స్ లో పని చేసే లేబర్ వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి వారి పిల్లలను స్కూల్స్ లో చేర్చొచ్చే అనే ఐడియా రాదు. ప్రభుత్వ బడుల్లో చేరొచ్చు. అయినా వెళ్లరు. ఎందుకు పేరెంట్స్ బిజీగా ఉంటారు. వీళ్లకి ఇంకో లైఫ్ అలవాటైపోయింది. చిన్నపిల్లలను పంపించడం కష్టంగా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ ను గుర్తించి మైహోమ్ కన్ స్ట్రక్షన్స్ ఛైర్మన్ రామేశ్వర రావు, వైస్ ఛైర్మన్ రాము రావు జూపల్లి దీన్ని పరిష్కరించాలి అన్న టైమ్ లో మా ప్రాజెక్ట్స్ ప్రెసిడెంట్ సాయి కొవేతో కలిసి ఏమైనా చేద్దాం అని నిర్ణయించారు. అలా డే కేర్ సెంటర్లు ప్రారంభమయ్యాయి” అని జూపల్లి మేఘన రావు తెలిపారు.

కార్మికుల పిల్లల కోసం గతేడాది డిసెంబర్ నెలలోనే డే కేర్ సెంటర్ ప్రారంభించింది మైహోమ్ సంస్థ. కొవే సంస్థతో భవిష్యత్తులో ఒప్పందం చేసుకుని డే కేర్ సెంటర్లలో ఉంటున్న పిల్లలకు మరింత మెరుగైన శిక్షణ అందిస్తామని నిర్వహకులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు